ఒక హీరోకి అభిమాని అంటే వేరొక హీరోకి విరోధి అని అర్థం రాదు. తమ అభిమాన హీరోని పొగడటం కోసం వేరొక హీరోని తిట్టాల్సిన పనిలేదు. అలాగే వేరే హీరోలతో గొడవ పెట్టుకోనవసరం లేదు. ఇదే సంగతిని ఇటీవలి కాలంలో ట్విట్టర్‌లో చెప్పాడు సల్మాన్‌ఖాన్. అమీర్‌ఖాన్, షారూక్‌ఖాన్ సైతం తనకి ఆప్తమిత్రులు అన్న సందేహం ఇచ్చాడు.
తనలోని మారిన మనిషిని ఆవిష్కరించాడు. అంతేకాదు అభిమానులు మారాలి. ఎవరూ ఎవరినీ తిట్టుకోకూడదు. కొట్లాటకు ఆహ్వానించకూడదు అంటూ శుద్ధులు చెప్పాడు సల్మాన్ భాయ్. ఇప్పుడు అదే బాటలో హీరో సూర్య కూడా అభిమానులకు సందేశం ఇచ్చాడు. పాజిటివ్‌గా ఉండండి. వేరే ఫ్యాన్స్ గురించి మీకు అనవసరం. ఆన్‌లైన్‌లో తిట్టుకోవడం, కొట్టుకోవడం మానేయండి. అంతేకాదు మీరు మీ కుటుంబంపై ఎక్కువ దృష్టి సారించండి.. అంటూ అభిమానుల్ని సముదాయించాడు సూర్య. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ద్వంద్వ యుద్ధం గురించి సల్మాన్, సూర్య ఇలా ప్రస్థావించారు.
ఇదే తీరుగా మన హీరోలు చరణ్, బన్ని, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్, మహేష్ కూడా అభిమానులకు సూచిస్తే బావుండేది. ఆడియో వేడుకల్లో, సక్సెస్ వేడుకల్లో అభిమానుల అనవసర హంగామాని తగ్గించుకోవడమే కాకుండా... కుటుంబాల కోసం అభిమానులు బతకాలని సూచిస్తే ఎంతో బావుణ్ణు కదూ?