సింగం-3లో దేవిశ్రీ ఎందుకు లేడంటే..

Update: 2017-02-06 10:44 GMT
‘సింగం’ సిరీస్‌లో వచ్చిన తొలి రెండు సినిమాలకూ దేవిశ్రీ ప్రసాద్ మాస్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు సినిమాల్లోనూ పాటలు మాస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ వాయిస్‌తో వచ్చిన ‘సింగం’ హమ్మింగ్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఐతే సింగం రెండు పార్టులకు అంత బలంగా నిలిచిన దేవిశ్రీని మూడో పార్టుకు తప్పించేయడం పెద్ద షాకే. ఇలాంటి మాస్ సినిమాకు హ్యారిస్ జైరాజ్ ను పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐతే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని అంటున్నాడు సూర్య. ఈ విషయంలో దేవిశ్రీ హర్ట్ కాకుండా చూసుకున్నట్లు సూర్య తెలిపాడు.

‘‘దేవిశ్రీని సింగం మూడో భాగానికి దూరంగా పెట్టడం అన్నది కఠిన నిర్ణయం. ఐతే సినిమా కోసమే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సింగం మూడో భాగం విషయంలో కొంచెం కొత్తదనం ఉండాలని అనుకున్నాం. హ్యారిస్ జైరాజ్ నాతో చాలా సినిమాలు చేశాడు. నా సినిమాలకు సరిపోయే మ్యూజిక్ ఇస్తాడతను. నా టేస్టేంటో అతడికి బాగా తెలుసు. కొంచెం భిన్నమైన మ్యూజిక్ ఉండాలనే హ్యారిస్‌ ను తీసుకున్నాం. దేవిశ్రీ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మాకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్పాడు’’ అని సూర్య తెలిపాడు. వరుసగా ‘సింగం’ సిరీస్ లో మూడు సినిమాలు చేసినా తనకేమీ బోర్ కొట్టలేదని.. జనాల నుంచి ఈ సినిమా కోసం డిమాండ్లు రావడంతోనే వాళ్ల ఆసక్తికి తగ్గట్లుగా సినిమా చేశామని.. ఈ ఆసక్తి కొనసాగినంత కాలం ‘సింగం’ ఫ్రాంఛైజ్ కూడా కొనసాగుతుందని సూర్య అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News