సూర్య‌లో డైల‌మా! ఆ ఇద్ద‌రిలో ఎవ‌రిని ఫైన‌ల్ చేశారు?

Update: 2021-06-24 08:30 GMT
త‌మిళ స్టార్ హీరో సూర్య తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. తెలుగు - త‌మిళ  ద్విభాషా చిత్రం చేయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్. ఆ క్ర‌మంలోనే మాస్ డైరెక్ట‌ర్ బోయపాటితో సూర్య ఈ మూవీ చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

కానీ అంత‌లోనే బోయ‌పాటి స్థానంలో త్రివిక్రమ్ పేరు కూడా వినిపించింది. సూర్య కోసం మాట‌ల మాంత్రికుడు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికి సూర్య  క‌మిట‌య్యారు? అన్న‌దానిపై  స‌రైన క్లారిటీ లేదు.

ఇప్పుడు మ‌రోసారి బోయ‌పాటి శ్రీ‌నుతో సూర్య ద్విభాషా చిత్రం చేస్తున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. కానీ దేనికీ అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. దీనిని బ‌ట్టి సూర్య ఇంకా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో డైల‌మాలోనే ఉన్నారా? అన్న చ‌ర్చా ఫిలింస‌ర్కిల్స్ ని వేడెక్కిస్తోంది. అధికారికంగా దీనిపై స‌మాచారం రావాల్సి ఉంది.

ప్ర‌స్తుతం బోయ‌పాటి అఖండ చిత్రాన్ని తెర‌కెక్కిస్తూనే సూర్య కోసం స్క్రిప్టుపైనా దృష్టి సారించారని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే వ‌రుస‌గా మాస్ సినిమాలు చేసే బోయ‌పాటి సూర్య కోసం ఎలాంటి స్క్రిప్ట్ రాస్తున్నారు? అన్న‌ది చూడాలి.

`ఆకాశం నీ హ‌ద్దురా` లాంటి క్లాసిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత త‌మిళంలో వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్న సూర్య తెలుగు-త‌మిళ్ ద్విభాషా చిత్రానికి స‌న్నాహాలు చేయ‌డం వెన‌క చాలా పెద్ద కార‌ణ‌మే క‌నిపిస్తోంది.  అయితే సూర్య తొలిగా ఎవ‌రికి అవ‌కాశం ఇస్తున్నారు?  మాస్ డైరెక్ట‌ర్ కా.. క్లాస్ డైరెక్ట‌ర్ కా.. అన్న‌ది తేలాల్సి ఉంది.


Tags:    

Similar News