స్వామిరారా, కార్తికేయ లాంటి సూపర్‌హిట్ల తర్వాత భారీ అంచనాలతో విడుదలైన నిఖిల్ సినిమా 'సూర్య వెర్సస్ సూర్య'. జనాలు ఆశించిన స్థాయిలో సినిమా లేకపోయినా.. టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నా కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండటం.. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని హైలైట్స్ సినిమాను నిలబెట్టాయి. నిఖిల్ మీద ఉన్న గుడ్‌విల్.. పోటీలో వేరే సినిమాలు లేకపోవడం కూడా కలిసొచ్చి రెండు వీకెండ్స్‌లోనూ సత్తా చాటింది సూర్య వెర్సస్ సూర్య. తొలి రోజే రూ.3 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా తొలి 11 రోజుల్లో 11 రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
నెట్ వసూళ్లు రూ.7 కోట్లకు పైనే ఉన్నాయి. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు రూ.10 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. ఉగాది సందర్భంగా సినిమాలు వచ్చే వరకు సూర్య వెర్సస్ సూర్య ప్రభావం ఉంటుంది కాబట్టి అప్పటికి అందరూ లాభాల్లోనే ఉంటారు. నిజానికి గత రెండు మూడు వారాలుగా బాక్సాఫీస్ దగ్గర సినిమాల పరిస్థితి ఘోరంగా ఉంది. పరీక్షలు, ప్రపంచకప్ ప్రభావంతో జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు. కొన్ని చోట్ల షోలు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిఖిల్ సినిమా ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం గొప్ప విషయమే.