40 వ‌య‌సులో 20 ఫీట్లకు హ్యాట్సాఫ్ సూర్య!

Update: 2020-04-16 06:30 GMT
పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేయ‌డం.. పాత్ర అవ‌స‌రాన్ని బ‌ట్టి రూపాన్ని మార్చుకునేందుకు హార్డ్ వ‌ర్క్ చేయ‌డం త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు కొత్తేమీ కాదు. ఇంత‌కుముందు `సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్` సినిమా కోసం అత‌డు ఎలాంటి సాహ‌సాలు చేశాడో చూశాం. స్కూల్ బోయ్ లా.. మిడిలేజీ యువ‌కుడిలా.. ఏజ్డ్ ప‌ర్స‌న్ గా ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లో క‌నిపించాడు. గౌత‌మ్ మీన‌న్ అత‌డిని అలా మ‌ల‌చ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఏజ్ గ్యాప్ తో పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేసేందుకు సూర్య కోచ్ సాయం తీసుకుని శ్ర‌మించారు.

మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తూ సూర్య అద‌ర‌గొడుతున్నాడు. ఒక‌ర‌కంగా సూర్య‌ లేటెస్ట్ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ చూస్తుంటే హ‌డ‌లెత్తాల్సిందేన‌నిపిస్తోంది. 40 ఏళ్ల వ‌య‌సులో సూర్య 19 వ‌య‌సు యువ‌కుడిగా మారిపోయాడు. దానికోసం జిమ్ కోచ్ సాయంతో ఎంత‌గా హార్డ్ వ‌ర్క్ చేశాడో ఇది చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. బ‌రువు త‌గ్గ‌డం పెర‌గ‌డం అనేది చాలా క్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. 19 ప్రాయంలో ఎక్స‌ర్ సైజుల‌కు బాడీ స‌హ‌క‌రించిన‌ట్టు న‌ల‌భైలో సహ‌క‌రిస్తుందా?. కానీ ఏదైనా సాధ్య‌మేన‌ని ప్రూవ్ చేస్తున్నాడు సూర్య‌. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం `ఆకాశ‌మే హ‌ద్దుగా` కోస‌మే ఈ సాహ‌సం.

ఈ మూవీలో ప్రారంభ స‌న్నివేశాల్లో 19 సంవత్సరాల యువ‌కుడిగా క‌నిపించాల్సి ఉందిట‌. అందుకే ఇంత హార్డ్ వ‌ర్క్ చేశాడు. తాజాగా మేకింగ్ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ 19 సంవత్సరాల వయస్సు నుండి నలభైల వరకు సాగించిన‌ ప్రయాణాన్ని ఈ మూవీలో చూపిస్తున్నారు. అందుకే సన్నగా కనిపించడానికి బరువును తగ్గించమని సూర్య‌ను ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర కోరార‌ట‌.  స్ప్రింటింగ్ .. పుషప్స్ చేయడం స‌హా భారీ బ‌రువులు ఎత్తే వ‌ర‌కూ సూర్య‌ ప్రతిదీ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇక బాడీ వెయిట్ ట్రైనింగ్ వీలున్న ప్ర‌తి చోటా.. ఎప్పుడైనా చేసేవాడని సూర్య క‌మిట్ మెంట్ గురించి సుధ కొంగ‌ర చెబు‌తున్నారు. 19 ఏళ్ళ వయస్సు యువ‌కుడిగా క‌నిపించేందుకు సూర్య శ్ర‌మ‌ను చూసి తాను షాక్ అయ్యానని.. పాత్ర కోసం అతను చేసిన కృషి అంతా ఇంతా కాద‌ని తెలిపారు.  ఇక ఈ చిత్రంలో సూర్య‌ కేవలం నాలుగు చొక్కాలు.. మూడు ప్యాంట్లు మాత్రమే ధరిస్తార‌ని కాస్ట్యూమ్ డిజైనర్ వెల్లడించారు

అపర్ణ బాలమురళి - పరేష్ రావల్- మోహన్ బాబు ఈ చిత్రంలో ఇత‌ర‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వ‌ర‌లో సినిమా రిలీజ్ కానుంది. క‌రోనా వ‌ల్ల ఇప్పటికి స‌స్పెన్స్ లో ప‌డింది రిలీజ్‌.
Tags:    

Similar News