SSMB28పై ప్ర‌చారం అంతా గ్యాసేనా?

Update: 2022-10-03 11:30 GMT
సినిమా ఇండ‌స్ట్రీలో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతోందంటే ట్రేడ్ వ‌ర్గాలు అంతంటున్నాయి.. ఇంతంటున్నాయి.. ఈ ఏరియా ఇంత ప‌లుకుతోంది.. ఓవ‌ర్సీస్ అయితే రికార్డు స్థాయి రేట్ ప‌లికింద‌ని, హిందీ డ‌బ్బింగ్ , థియేట్రిక‌ల్ రైట్స్‌, శాటిలైట్ హ‌క్కులు, ఓటీటీ రైట్స్ ప‌రంగా భారీ పోటీ నెల‌కొందంటూ కొంత మంది మేక‌ర్స్ హైప్ కోసం గ్యాస్ కొట్టేస్తుంటారు. అలాంటి గ్యాస్ వార్త‌లే మా SSMB28 ప్రాజెక్ట్ విష‌యంలో వినిపించాయి అంటున్నాడు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ.

దాదాపు 12 ఏళ్ల విరామం త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూసిన ఈ భారీప్రాజెక్ట్ రీసెంట్ గా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన విష‌యం తెలిసిందే.

ప‌లు యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని మ‌హేష్‌, కొంత మంది ఫైట‌ర్స్ పై భారీ స్థాయిలో చిత్రీక‌రించారు. దీంతో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. త్వ‌ర‌లో సెకండ్ షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది.

అయితే ఈ మూవీ కోసం రూ. 200 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని, బిజినెస్ దాదాపే రూ. 300 కోట్ల మేర జ‌రుగుతోంద‌ని, ఆడియో హ‌క్కుల‌కే భారీ స్థాయిలో రూ. 30 కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ని, ఓటీటీ, శాటిలైట్‌, థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగానూ భారీ పోటీ నెల‌కొందంటూ ఇటీవ‌ల ఈ ప్రాజెక్ట్ పై ర‌క‌ర‌కాల వార్త‌లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

SSMB28 పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాద‌ని, అలాంట‌ప్పుడు వంద‌ల కోట్ల బిజినెస్ ఎలా జ‌రుగుతుంద‌ని, ఇంకా మేము బిజినెసే మొద‌లు పెట్ట‌లేద‌ని, అంతే కాకుండా ఈ మూవీకి బ‌డ్జెట్ ఎంత అన్న‌ది ఇంకా మాకే ఓక్లారిటీ రాలేద‌ని, అలాంట‌ప్పుడు షూటింగ్ ద‌శ‌లోనే బిజినెస్ ఎలా మొద‌లు పెడ‌తామ‌న్నాడు సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ.

ఈ రోజుల్లో ప్ర‌తీ స్టార్ సినిమా ఆడియో రైట్స్ కి రూ. 5 నుంచి 6 కోట్లు వ‌స్తున్నాయన్నారు. అలాంట‌ప్పుడు SSMB28 ఆడియోకు 25 నుంచి 30 కోట్లు అన్న‌ది ట్రాష్ అని కొట్టి పారేశారు. దీంతో ఈ సినిమా బిజినెస్ పై జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా వ‌ట్టి గ్యాసే న‌ని తేలిపోయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News