బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు నుంచి సుశాంత్ సూసైడ్ పై అనుమానాలున్నాయని సీబీఐకి కేసుని అప్పగించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో సుషాంత్ ఆత్మహత్య వెనుక అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ అతని మరణానికి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తూ జులై 26న వారిపై బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ కొటాక్ మహేంద్ర బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్లు వేరే అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయ్యాయని.. ఆ బ్యాంక్ అకౌంట్స్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడివేనని ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. దీంతో రియాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా బీహార్ పోలీసులు బాంద్రా కొటాక్ బ్యాంక్ లోని సుశాంత్ అకౌంట్స్ కి సంబంధించిన వివరాలు సేకరించారు .
ఇదిలా ఉండగా ఓ జాతీయ టీవీ ఛానల్ వారు చేపట్టిన దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్ రాబట్టిన సదరు ఛానల్ వారు గత ఏడాది నుంచి సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి డబ్బును వాడుకొన్నట్టు స్పష్టమైంది. రియా ఫ్లైట్ టికెట్స్, హెయిర్ కటింగ్, మేకప్, షాపింగ్, పార్లర్ ఖర్చుల కోసం సుశాంత్ డబ్బునే చెల్లించిందని తెలుస్తోంది. షోవిక్ చక్రవర్తి ఫ్లైట్ టికెట్స్ కోసం రూ.81 వేలు.. హోటల్ ఖర్చుల కోసం రూ.4 లక్షలు.. పార్లర్ ఖర్చుల కోసం రూ. 1లక్ష ఖర్చుచేసినట్లు ఛానల్ వారు సంపాదించిన బ్యాంక్ స్టేట్మెంట్ లో స్పష్టమైంది.
కాగా సుశాంత్ బ్యాంక్ అకౌంట్లలో జరిగిన అవకతకవలపై దర్యాప్తు చేయడానికి ఈడీ రంగంలోకి దిగింది. ఈ మేరకు బీహార్ పోలీసులను ఎఫ్.ఐ.ఆర్ కాపీ ఇవ్వాలని అధికారులు కోరినట్లు సమాచారం. అలానే సుశాంత్ తండ్రి కేకే సింగ్ నుంచి సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నారు. సుశాంత్ బ్యాంకు అకౌంట్లను మరే రూపంలోనైనా దుర్వినియోగం చేశారా.. మనీ లాండరింగ్, చట్ట వ్యతిరేక ఆస్తులను.. అక్రమ ఆస్తుల కొనుగోలు చేసారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.