ఆత్మహత్య పిరికి పంద చర్య అని నమ్మేవాడు.. శివనామ స్మరణతో ధ్యానం చేసేవాడు.. నిరంతరం వ్యాయామం చేస్తూ పాజిటివిటీతో జీవించేవాడు.. చాలా ముందే బతుకు చిత్రం ఎలా ఉండాలో ఊహించేవాడు.. ఉన్నట్టుండి ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు? ఇక్కడే ఏదో డౌట్ కొడుతోంది.
స్నేహితుల దుర్మార్గమా? లేక కంగన ఆరోపిస్తున్నట్టు ముంబై మాఫియా ఆడుతున్న నాటకమా అది? లేక ప్రియురాలు రియా చక్రవర్తి వెనక ఉన్న అదృశ్య శక్తులే ఈ పని చేశాయా? ఇలాంటి ఎన్నో సందేహాలు నెటిజనుల్లో వ్యక్తమవుతున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సూచించినట్లుగా వాస్తవానికి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనేదానిపై సందేహం వ్యక్తమయ్యేలా చేస్తోంది. ``సుశాంత్ ప్రీప్లాన్డ్ పర్సనాలిటీ. వాస్తవానికి జీవితంలో ప్రతిదీ చాలా ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం అలవాటు. మరణానికి ముందు జూన్ 29 వరకు తన రోజువారీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? అన్నదానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు`` అని ఆమె వ్యక్తీకరించారు. అయితే సరిగ్గా 15రోజుల ముందు అంటే.. జూన్ 14 న సుశాంత్ తన నివాసంలో ఉరి వేసుకోవడం సంచలనమైంది. అది ఎన్నో సందేహాలకు తావిచ్చింది.
సుశాంత్ స్వయంగా ఒక బోర్డ్ పై చేతి రాతతో జూన్ 29వరకూ షెడ్యూల్ ని రాసి పెట్టుకున్నారనేందుకు ఆధారాన్ని ఒక ఫోటో రూపంలో తన సోదరి రివీల్ చేశారు. జూన్ 29 నుండి ప్రతిరోజూ అతీంద్రియ ధ్యానాన్ని అభ్యసించాలనే అతడి ప్రణాళికలు బయటపడ్డాయి. పుస్తకాలు చదవడం.. కంటెంట్ సినిమాలు / సిరీస్ లు చూడటం.. గిటార్ .. వ్యాయామం నేర్చుకోవడం వంటివి షెడ్యూల్లో ఉన్నాయి. ముఖ్యంగా వ్యాయామం దాంతో పాటే అతీంద్రియ ధ్యానం అనేవి కీలకంగా ఉన్నాయి.
ఈ పోస్ట్ చదివిన ప్రతి నెటిజను సుశాంత్ సోదరికి మద్దతునిస్తూ అతడి ఆత్మకు న్యాయం జరగాలని ప్రార్థించారు. సుశాంత్ సింగ్ ఎంతో నేర్పించారని.. అతడొక శక్తి వంటి వాడని .. ఎన్న సానుకూలతలు ఉన్న వ్యక్తిత్వం అని ఒక నెటిజన్ ప్రశంసలు కురిపించాడు. అతను ఒక మేధావి.. తెలివైనవాడు.. ప్రతిభావంతుడు.. నిజమైన హీరో. అతన్ని హత్య చేశారు.. వారే చంపారు అంటూ ఒకక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. సత్యంవైపు మార్గనిర్ధేశనం కలిగినవాడు శివుడిని పూజించేవాడు ఎప్పటికీ లొంగిపోడు అంటూ వేరొక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేయడం ఆసక్తికరం. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య జరిగిందా? అన్నదానిపై ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారని అర్థమవుతోంది. వాదోపవాదాలు రకరకాల సందేహాలకు తావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తును పోలీసులు సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రియురాలి వంచన.. బిజినెస్ భాగస్వామ్యం.. మనీ డీల్స్ .. బాలీవుడ్ మాఫియా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఆ పదిహేను రోజుల షెడ్యూల్ కి ముందే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక చంపారా? అన్నదే తేల్చాల్సి ఉంది.