సుశాంత్‌ : కేసు రెండు రాష్ట్రాల మద్య వివాదంగా మారనుందా?

Update: 2020-08-01 08:50 GMT
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సుశాంత్‌ మృతి చెందినది ముంబయిలో కనుక మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే ఎంక్వౌరీ ప్రారంభించారు. అయితే సుశాంత్‌ సొంత రాష్ట్రం బీహార్‌ అవ్వడం వల్ల ఆ రాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసును ఎంక్వౌరీ చేయడడం మొదలు పెట్టారు. సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఇటీవలే పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులను అనుమానితులుగా చేర్తి కేకే సింగ్‌ పిటీషన్‌ ఇచ్చాడు. ఈ కేసు విషయమై బీహార్‌ మరియు మహారాష్ట్ర పోలీసుల మద్య వివాదం తలెత్తింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే స్పందించారు. సుశాంత్‌ కేసును కొందరు రాజకీయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఐదు సంవత్సరాల పాటు సీఎంగా చేసిన ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకపోవడం విచారకరం. ఈ కేసులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు తమ ప్రభుత్వం మరియు పోలీసులు సిద్దంగా ఉన్నారు. ఎవరి వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా కూడా స్వీకరించి విచారణను సమగ్రంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ కేసులో బీహార్‌ పోలీసులు ఎంటర్‌ అవ్వడంపై సీఎం మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మద్య గొడవగా దీన్ని మార్చవద్దు అన్నాడు. కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశ్యంతో ముంబయి పోలీసులను అనుమానిస్తున్నారు. తద్వారా బీహార్‌ మరియు మహారాష్ట్రల మద్య వాతావరణం చెడిపోతుందని అన్నారు. సుశాంత్‌ ఆత్మహత్య కేసును మహా పోలీసులు పరిష్కరించగలరని సీబీఐ వరకు వెళ్లనక్కర్లేదని ఈ సందర్బంగా సీఎం ఠాక్రే అన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు 40 మందిని విచారించగా ఇప్పుడు బీహార్‌ పోలీసులు కూడా మళ్లీ వారిని విచారించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News