బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుని కేంద్రం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అన్ని కోణాల్లో ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా వున్న రియాని ప్రశ్నించిన సీబీఐ పలు కీలక విషయాల్ని రాబట్టింది. తాజాగా సుశాంత్ హౌస్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరండాని ప్రశ్నించింది. ఈ సందర్భంగా శ్యామ్యూల్ మిరండా పలు కీలక విషయాల్ని బయటపెట్టినట్టు తెలిసింది.
ఇప్పటికే ఈ కేసులో పలువురిని ప్రశ్నించిన సీబీఐ పలు కీలక ఆధారాలని సంపాదించింది. తాజాగా సుశాంత్ సింగ్ మాజీ హౌస్ మేనేజర్ శ్యామ్యూల్ మిరిండాను ప్రశ్నించగా.. పలు విషయాలు తెలిసాయి. నిజానికి సుశాంత్ ఇంట్లో మేనేజర్ గా శ్యామ్యూల్ మిరండాని సుశాంత్ సోదరి ప్రియాంక అమె భర్త సింగ్ నియమించారట. ఈ టైమ్ లోనే రియా ఎంట్రీ ఇచ్చిందని శ్యామ్యూల్ వెల్లడించాడు.
జనవరి 2020లో సుశాంత్ కోసం రియా పార్టీలు కండక్ట్ చేసిందని.. శృతి మోడీ సెలబ్రిటీ మేనేజర్ గా అపాయింట్ అయ్యిందని ఆ తరువాతే రియా తన మకాంని సుశాంత్ ఇంటికి పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో రియా పేరెంట్స్ .. సోదరుడు షోవిక్ కూడా ఇంటికి వచ్చేవాడని తెలిపాడు. సుశాంత్ బిజీగా వుండాలని రియా వారానికి రెండు మూడు సార్లు పార్టీలని ఏర్పాటు చేసేదని అసలు విషయం బయటపెట్టాడు. జనవరిలో జరిగిన ఓ పార్టీ తరువాత సుశాంత్ తన ఇంటిని అమ్మేయాలని చెప్పాడని అప్పుడే సుశాంత్ ని మానసిక చికిత్స కోసం కేరళ వెళ్లాలని సూచించిందని చెప్పుకొచ్చాడు. దీంతో సుశాంత్ మనసికంగా వొత్తిడికి లోనయ్యే వాడని తెలుస్తోంది. రాను రాను సుశాంత్ కేసులో మరెన్ని ట్విస్టులు బయటికి వస్తాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.