సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోయిక్.. శామ్యూల్ మిరాండాలను కొన్ని గంటల క్రితం ఎన్.సి.బి (నార్కోటిక్స్) బృందాలు అరెస్టు చేయడం సంచలనమైంది. అయితే ఈ దర్యాప్తులో మరో కీలక కోణం బయటపడింది.
రియా చక్రవర్తి క్రెడిట్ కార్డ్ డార్క్ నెట్ లో డ్రగ్స్ కోసం చెల్లింపులు చేయడానికి ఉపయోగించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామాలలో ఒకటిగా ఇది సీబీఐ రికార్డుల్లో నమోదైంది. అయితే ఈ కేసులో సోయక్.. మిరిండాల అధికారిక అరెస్టు ఇంకా జరగలేదని.. వీరిద్దరిని శనివారం కోర్టుకు హాజరుపరుస్తామని సమాచారం. ఈలోగానే చాలావరకు రియా చక్రవర్తికి సంబంధించిన షాకింగ్ నిజాలు బయటపడుతుండడం చర్చనీయాంశమైంది.
ముంబై మీడియా కథనాల ప్రకారం.. షోయిక్ - మిరాండా బ్యాచ్ ఇద్దరూ నటి సూచనల మేరకు డ్రగ్స్ సేకరించినట్లు దర్యాప్తులో అంగీకరించారు. మాదకద్రవ్యాల కోసం డార్క్ నెట్ లోని రియా కార్డుల ద్వారా శామ్యూల్ మిరాండా సిండికేట్ గ్యాంగ్ ఇతర డ్రగ్ డీల్ సభ్యులకు చెల్లింపులు చేసేవారని తెలుస్తోంది. దీనిపై విచారించేందుకు రియాను అలానే.. ఏజెన్సీకి చెందిన దీపేశ్ సావంత్ ను పిలిపించినట్లు సమాచారం.
అంతకుముందు రియా- సోయిక్ ద్వయంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొద్దిమంది డ్రగ్ పెడ్లర్లను ఎన్.సి.బి అరెస్టు చేసింది. వారిలో ఒకరు తనకు తెలుసునని వీళ్లు ఒప్పుకున్నారు. మాదకద్రవ్యాల వ్యవహారం కోసం బాంద్రాలోని ఒక ఫుట్ బాల్ క్లబ్ లో అతన్ని కలిసినట్లు తెలిసింది. కొన్ని వారాల క్రితం సిబిఐ - ఎన్.సి.బిలతో రియా చక్రవర్తి వాట్సాప్ చాట్ లను ఈడీకి అప్పగించినప్పుడు మాదకద్రవ్యాల్లో కుట్ర కోణం బయటపడింది. ఆమె మరికొందరు వ్యక్తులతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేయనున్నారని సమాచారం. ఇక ఇందులో రియా వెనక అసలైన పెద్ద మనిషి వారి తాలూకా గ్యాంగ్ లు బయటపడతాయా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.