#సుశాంత్ కేసు.. ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టుగా..!

Update: 2020-10-14 04:15 GMT
సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ర‌ణంతో ముడిప‌డిన డ్ర‌గ్స్ మాఫియా టాపిక్.. నెపోటిజం .. ఇన్ సైడ‌ర్ ఔట్ సైడ‌ర్ టాపిక్స్ పై జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు అగ్గి రాజేశాయి. సుశాంత్ ఎపిసోడ్ పై సీబీఐ విచార‌ణ లో ఏదీ తేల‌క‌పోవ‌డంతో బిహారీలంతా భ‌గ‌భ‌గ మండుతున్నారు. ఇప్పుడు ఇది బీహార్ ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

సుశాంత్ కేసు బీహార్ పోల్ ఇష్యూగా మారింది. `ప్రజలకు సమాధానాలు కావాలి` అని ఆ రాష్ట్ర మంత్రి ఒక‌రు మీడియాతో అన‌డం చర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ముఖ వార్తా చానెల్ తో ప్రత్యేక సంభాషణలో బీహార్ మంత్రి.. రాష్ట్ర జెడియు అధ్యక్షుడు అశోక్ చౌదరి మాట్లాడుతూ, ..``ఇది ఒక ఆస‌క్తి పెంచిన‌ సమస్య. ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు`` అని వ్యాఖ్యానించారు.

రాబోయే బీహార్ ఎన్నికలలో రాజ్‌పుత్ మరణ రహస్యం రాజకీయ సమస్యగా మారింది. సుశాంత్ విష‌యంలో నిజంగా ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు.. తుది ఫలితం తెలుసుకోవాలని వేచి చూస్తున్నార‌ని స‌ద‌రు మంత్రి వ‌ర్యులు వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఈ కేసును అంత‌కంత‌కు హైప్ పెంచడంతో ప్రజలు అతని కుటుంబం నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు అని ఆయన అన్నారు.

ఇదిలావుండగా.. ఎయిమ్స్ టీం రిపోర్టుపై ఆరోపించిన ఐదు ప్రశ్నలపై ఆరోగ్య కార్యదర్శితో సంభాషణలు ముగించినట్లు బిజెపి నాయకుడు.. రాజ్యసభ ఎంపి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మంగళవారం తెలియజేశారు. మంత్రిత్వ శాఖను లూప్ లో ఉంచలేదని.. సంబంధిత నిపుణులతో మాట్లాడతాన‌ని ఆయ‌న అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న తన బాంద్రా అపార్ట్ ‌మెంట్ ‌లో చనిపోయినట్లు గుర్తించారు. ముంబై పోలీసులు ఇంతకుముందు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ఎడిఆర్) ను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సుప్రీంకోర్టు ఆమోదం తరువాత ఆగస్టులో హై-ప్రొఫైల్ కేసుపై దర్యాప్తును సిబిఐ చేపట్టింది. సుశాంత్ హత్యకు సహకరించింద‌ని ఆరోపిస్తూ నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులపై రాజ్‌పుత్ తండ్రి కెకె సింగ్ జూలై 25 న బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags:    

Similar News