రియా తనని వేధిస్తోందని సుశాంత్ నాతో చెప్పాడు : అంకిత

Update: 2020-07-30 06:15 GMT
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ సూసైడ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సుశాంత్‌ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా అతడి తండ్రి కేకే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు కేసు రియా వైపు మళ్లింది. కాగా సుశాంత్‌ మాజీ ప్రేమికురాలు అంకితా లోఖండే పోలీసుల ఎంక్వైరీలో సుశాంత్‌ - రియాల రిలేషన్ గురించి కీలక విషయాలు వెల్లడించారని సమాచారం.

కాగా, 'మణికర్ణిక' రిలీజ్ టైంలో తనను అభినందించేందుకు సుశాంత్‌ తనకు మెసేజ్‌ చేశాడని.. అప్పుడు సుశాంత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడని.. రియా తనను వేధిస్తోందని చెప్పాడని.. రియాతో బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నట్లు సుశాంత్‌ చెప్పాడని అంకిత లోఖండే వెల్లడించింది. ఇందులో భాగంగా ఇద్దరి మధ్య జరిగిన ఛాటింగ్ కి సంబంధించిన వివరాలను బీహార్ పోలీసులకు అందించారు. సుశాంత్‌ సూసైడ్ తర్వాత అతడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రెండుసార్లు పాట్నాకు వెళ్లానన్న అంకిత.. సుశాంత్‌ సోదరి శ్వేత సింగ్‌ కీర్తితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. ఇక సుశాంత్ తండ్రి రియా పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడని వార్తలు వస్తున్న సమయంలో ''ట్రూత్ విన్స్'' (నిజమే గెలుస్తుంది) అని అంకిత తన సోషల్‌ మీడియా అకౌంట్‌ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా అంకిత లోఖండే సుశాంత్‌ తో కలిసి 'పవిత్ర రిష్తా' అనే హిందీ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ క్రమంలో అంకితా లోఖండే - సుశాంత్‌ లు ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల పాటు సజావుగానే సాగిన వీరి బంధంలో మనస్పర్థలు రావడంతో 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ - అంకిత లోఖండే ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. అంకిత 2016లో వీడిపోయే ముందు 'ఒంటరినని బాధపడకు, నేను నీ గుండెల్లో ఎప్పడు చిరస్థాయిగా నిలిచిపోతాను' అని అంకిత ట్వీట్ కూడా‌ చేసింది. అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న సుశాంత్ వేరే నటితో డేటింగ్‌ చేసారు. అయితే అంకిత - సుశాంత్‌ లు వీడిపోయాక కూడా మంచి స్నేహితులుగా కొనసాగారని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటారు.
Tags:    

Similar News