బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ - మాజీ ప్రపంచ సుందరి సుష్మిత సేన్ మరోసారి ప్రేమలో పడ్డట్లుగా బాలీవుడ్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో నైట్ క్లబ్ ఓనర్ రితిక్ భాసిన్ తో బ్రేకప్ అయిన సుష్మిత సేన్ ప్రస్తుతం దిల్లీకి చెందిన మోడల్ రోహమన్ షాల్ తో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అన్నట్లుగా సుష్మిత సేన్ అనధికారికంగా తన ప్రేమను తేల్చి చెప్పేసింది.
తాజాగా ఎయిర్ పోర్ట్ లో రోహమన్ షాల్ తో కలిసి ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన సుష్మిత సేన్ ఈమద్య వరుసగా అతడి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా తన దత్త కూతురు రీనా సంగీతం నేర్చుకుంటూ ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. అందులో రోహమాన్ కూడా ఉన్నాడు. సంగీతం మాస్టారు వద్ద రీనాతో పాటు రోహమన్ కూడా సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు. నా కూతుర్లకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో అతడు ఉండటం చాలా సంతోషంగా ఉందని, అతడితో నా కూతుర్లు బాగా కలిసి పోతున్నారని - లవ్ యూ గయ్స్ అంటూ సుష్మిత సేన్ సోషల్ మీడియాలో పేర్కొంది.
పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సుష్మితా సేన్ ఇప్పటి వరకు భార్య మాత్రం కాలేదు. రోహమన్ ను అయినా వివాహం చేసుకుంటుందో చూడాలి. రోహమన్ గురించి పదే పదే సుష్మితా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తుంటే ఇద్దరి మద్య రిలేషన్ చాలా దూరం వెళ్తుందని - సుష్మితతోనే కాకుండ ఆమె కూతుర్లకు కూడా రోహమన్ దగ్గర అయ్యి - వారి ఫ్యామిలీలో ఒక్కడిగా కలిసి పోయినట్లుగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ రిలేషన్ లో మరింత ముందడుగు ఉంటుందేమో అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.