పాన్ ఇండియా సినిమాల వెల్లువలో అల్లు `రామాయణం 3డి` ఇప్పుడు ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇది ట్రయాలజీ సిరీస్. ఇందులో హృతిక్ రోషన్ ఓ కీలక పాత్రను పోషిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ ని శ్రీరాముడిగా నటింపజేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తున్న పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఆ పాత్ర కోసం దీపిక ఏకంగా 10 కోట్లు పైగా డిమాండ్ చేసిందని కథనాలొస్తున్నాయి. ఒక మహిళా నటి అంత డిమాండ్ చేయడం సబబేనా? అంటూ ఆన్ లైన్ లో డిబేట్ రన్ అవుతోంది. దీపిక ఏ సినిమాకి సంతకం చేసినా సుమారు అంత పెద్ద మొత్తం డిమాండ్ చేస్తున్నారు.
దీనికి పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. పురుషాధిక్య ప్రపంచంలో కేవలం హీరోలకేనా భారీ పారితోషికాలు... హీరోయిన్లకు పెద్ద పారితోషికాలు ఇవ్వకూడదా? అన్న చర్చ దీనిలో ప్రధానంగా హైలైట్. దీపిక ఇప్పటికే బాలీవుడ్ చిత్రాలకు భారీ పారితోషికం అందుకుంటున్నారు.
ఇక దీపిక స్థానంలో అల్లు `రామాయణం`లో సీతగా నటించడానికి బెబో కరీనా కపూర్ ని సంప్రదిస్తే రూ.12 కోట్లు అడిగిందని ప్రచారమైంది. అయితే అంత పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం సరైనదేనా? అంటే.. బుట్టబొమ్మ పూజా హెగ్డే అందులో తప్పేమి ఉంది? అంటూ ప్రశ్నించారు. తనకు మద్ధతుగా ముందుకు వచ్చారు. ప్రజలకు ఎప్పుడూ ఒక అభిప్రాయం ఉంటుందని.. ఆడాళ్ల విషయంలో అది మారాలని పూజ అన్నారు. కరీనా తన విలువ ఎంతో చెప్పారు.. తప్పేమి ఉంది? అని పూజా అడిగారు.
అయితే సీత పాత్రను పోషించడానికి కరీనా తన ఫీజులను పెంచడాన్ని హిందూ వాదులు సహించలేదు. దేశంలోని ఒక కమ్యూనిటీ మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని వాదించింది.
కుచ్ తో లాగ్ కహేంగే,.. లోగో కా కామ్ హై కెహ్నా (ప్రజలు ఎల్లప్పుడూ ఒక అభిప్రాయం కలిగి ఉంటారు.. ఎందుకంటే వారు అలా చేస్తారు) .. ఈ పాటలానే అభిప్రాయాలుంటాయి. పారితోషికం అడగడం అనేది ఉద్యోగంలో ఒక భాగం. కరీనా కూడా అడిగే విషయంలో విమర్శల విషయంలోనూ కలవరపడలేదని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. ఆమెకు మరింత శక్తి రావాలి! కరీనా తన విలువ ఎంత అని అనుకుంటున్నారో అదే అడుగుతున్నారు! చివరికి ఏమి చెల్లించగలరు అనేది నిర్మాత ఆలోచిస్తారు. ఎంత ఎక్కువ మంది మహిళలు తమ విలువను గుర్తిస్తారో.. అంత ఎక్కువ అర్హతను వారు పొందుతారు`` అని పూజా హెగ్డే అంది.
ఇప్పటివరకు పురుషాధిక్యాన్ని ప్రశ్నించడంలో తాప్సీ పన్ను ముందు వరుసలో ఉంది. తాప్సీతో పాటు `ది ఫ్యామిలీ మ్యాన్` ఫేమ్ ప్రియమణి కూడా కరీనాను రక్షించడానికి మద్ధతుగా ముందుకు వచ్చారు. ప్రియమణి బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే..``వేతన సమానత్వం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. ఒక మహిళ తనకు అర్హతను బట్టి అడిగితే అది తప్పు కాదు. దానికి ఆమె అర్హురాలని నేను అనుకుంటున్నాను. అది ఆమె మార్కెట్ విషయం.. అంత అడగడానికి ఆమె అర్హురాలు. కాబట్టి మీరు దానిని ప్రశ్నించాలని నేను అనుకోను ... లేడీస్ ఏమి కోరుకుంటున్నారో చెప్పగలిగే స్థితికి చేరుకున్నారు ... అది తప్పు అని మీరు భావించినందున ఆ వ్యక్తిపై వ్యాఖ్యానించలేరు.. ఆ వ్యక్తి దానికి అర్హులు కాదని అర్థం`` అంటూ ప్రియమణి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
తన మార్కెట్ స్థాయిని బట్టి అడిగితే ఆ వ్యక్తి జీవితంలో నిజంగా పెద్ద విజయాన్ని సాధించినట్లే. కానీ ఒక మహిళ మాత్రమే అడుగుతున్నందున `కష్టం` అని.. చాలా డిమాండ్ చేస్తోందని అంటారు. ఇది ఎల్లప్పుడూ అలానే ఉంటుంది... అని తాప్సీ కూడా ఓ మీడియా చాట్ లో కాస్త టోన్ పెంచారు. ఇటీవల ఒక్కసారిగా కరీనా ఈ సినిమా కోసం దాదాపు రూ. 6-8 కోట్ల నుండి తన పారితోషికాన్ని ఏకంగా రూ.12 కోట్లకు పెంచిందని తెలిసింది.
పూజా హెగ్డే కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న కభీ ఈద్ కభీ దీపావళి సెట్స్ పై ఉంది. సిర్కస్ కూడా చిత్రీకరణ దశలో ఉంది. తమిళంలో విజయ్ సరసన బీస్ట్ లో నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లో ప్రభాస్ సరసన నటించిన రాధే శ్యామ్ ..చిరంజీవి- చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ఆచార్య రిలీజ్ లకు రావాల్సి ఉంది.