'కొండ పొలం' లోని సోల్ ఫుల్ మెలోడీ.. 'శ్వాసలో'

Update: 2021-09-30 12:19 GMT
పంజా వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''కొండ పొలం''. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ - వీడియోలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'శ్వాసలో' అనే పాట లిరికల్ వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది.

'నీలో నాలో.. నీలో నాలో.. శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ.. ఆశలో పొద్దుల్ని మోసే హాయి మోశా..' అంటూ సాగిన ఈ గీతానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చడమే కాకుండా.. సాహిత్యం అందించడం విశేషం. ఈ అందమైన మెలోడీ గీతాన్ని యువ గాయకుడు పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రొమాంటిక్ మూడ్ సాగిన ఈ సాంగ్.. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ జ్వాలలు రగిలిస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ ల కెమిస్ట్రీ బాగుంది.

'శ్వాసలో' పాట విజువల్ గా కూడా కొత్త అనుభూతిని కలిగిస్తోంది. సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వీఎస్ అటవీ నేపథ్యంలో ఇద్దరి మధ్య రొమాన్స్ ని అందంగా క్యాప్చర్ చేశారు. శ్రోతలను అలరిస్తోన్న ఈ పాట 'ఓబులమ్మ' తరహాలోనే చార్ట్ బస్టర్ గా నిలవనుంది. రాజ్ కుమార్ గిబ్సన్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా.. శ్రవణ్ కటికనేని ఎడిటర్ గా వర్క్ చేశారు.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండ పొలం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Full View
Tags:    

Similar News