ఫిల్టర్ లేకుండా ఆ క్షణంలో ఏదని పిస్తే అది మాట్లాడేస్తుంటాడు అలీ. స్టేజీ అయినా కానివ్వండి, టీవీ షోలలోనైనా కానివ్వండి. ఎదురుగా ఉన్నవాళ్లపై పంచ్ ల మీద పంచులు వేస్తుంటాడు. వాటిలో బోలెడన్ని ద్వంద్వార్థాలు ధ్వనిస్తుంటాయి. ఆయన మాటతీరు చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఇటీవల అన్నపూర్ణ సుంకర అనే ఓ ఎన్నారై `అలీకి డాక్టరేట్ ఉంది కానీ.. కామన్ సెన్స్ లేదు` అంటూ వీడియో చేసి ఘాటుగా విమర్శించింది. ఆ వీడియోతో అలీ మరోసారి వార్తల్లోకెక్కాడు. చాలామంది `నిజమే అలీ మాటలు అతిగా ఉంటున్నాయి` అంటున్నారు. మరికొద్దిమంది మాత్రం `నవ్వించేందుకే కదా లైట్ తీసుకోండి` అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా... అలీ మాత్రం ఎప్పట్లాగే తన దారిలో తాను వెళుతున్నాడు.
అలీ హోస్ట్ చేస్తున్న ఓ రియాలిటీ షోలో అలీ ఎప్పట్లాగే డబుల్ మీనింగ్ మాట్లాడేశాడు. యాంకర్ శ్యామల ఆ షోలో పాల్గొంది. ఆమెతో మాట్లాడుతూ.. `నువ్వు నేను ఇంట్లో...` అంటూ ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. యాంకర్ శ్యామల ఆయన మాటల్ని అడ్డుకొని ``మీరు రాంగ్ రూట్లో మాట్లాడుతున్నారు. నేను మా అన్నపూర్ణకి చెబుతా`` అని నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చేసింది. `చెప్పేస్తావా..` అంటూ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశాడు. చూస్తుంటే అలీ డబుల్ మీనింగ్ మాటల్ని వదిలిపెట్టేలా లేడు.