సైరా 3 రోజుల‌ బాక్సాఫీస్ రిపోర్ట్‌

Update: 2019-10-05 14:36 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం `సైరా- న‌ర‌సింహారెడ్డి`. తొలిరోజుతో పోలిస్తే క‌లెక్ష‌న్స్ కొంత మంద‌గించినా రెండో రోజు కంటే మూడ‌వ రోజు కొంత మేర‌ పుంజుకుందని తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి. తొలి రోజుతో పోలిస్తే 30 శాతం క‌లెక్ష‌న్ లు డ్రాపైనా మూడు రోజుల‌కు ఓవ‌రాల్ గా 53. 96 కోట్ల షేర్ ని వ‌సూలు చేసింది. రెండ‌వ రోజు కొంత త‌గ్గుద‌ల క‌నిపించినా మూడ‌వ రోజు మాత్రం పుంజుకుని మంచి నంబ‌ర్స్ ని చేరుకుంది.

`సైరా` మూడు రోజుల‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా వున్నాయి. నైజామ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ 30 కోట్ల‌కు జ‌రిగింది. తొలి రోజు 8కోట్ల 10 ల‌క్ష‌ల గ్రాస్ ని సాధిస్తే మూడు రోజుల‌కు 14 కోట్ల 62 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. సీడెడ్ లో 20 కోట్ల‌కు ప్రీరిలీజ్ బిజినెస్ జ‌రిగింది. మూడు రోజుల‌కు 9 కోట్ల 5ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. అమెరికాలో 14 కోట్ల 40 ల‌క్ష‌ల‌కు బిజినెస్ జ‌రిగితే మూడు రోజుల్లో 7 కోట్ల 40 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. గుంటూరులో నాన్ రిఫండ‌బుల్ అమౌంట్ కింది 9 కోట్ల 80 ల‌క్ష‌ల‌కు అమ్మితే మూడు రోజుల్లో 5 కోట్ల 71 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. వెస్ట్ గోదావరిలో 8 కోట్ల 40 ల‌క్ష‌ల‌కు అమ్మారు. మూడు రోజుల‌కు 4 కోట్ల 63 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది.

కృష్ణా జిల్లాలో 9 కోట్ల‌కు ప్రీరిలీజ్ బిజినెస్ జ‌రిగింది. మూడు రోజుల్లో 4 కోట్ల 25 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. నెల్లూరు 4 కోట్ల 80 ల‌క్ష‌ల‌కు అమ్మారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2 కోట్ల 65 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 107 కోట్ల 90 ల‌క్ష‌ల బిజినెస్ జ‌రిగితే ఈ మూడు రోజుల్లో అందులో స‌గం 54 కోట్ల 50 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. క‌ర్ణాట‌క‌లో 27 కోట్ల‌కు ఔట్ రేట్‌కిచ్చారు. మొద‌టి రోజే 10కోట్లు వ‌సూలు చేసింది అక్క‌డ‌. మూడు రోజుల వ‌సూళ్ల‌ వివ‌రాలు తెలియాల్సి వుంది. త‌మిళ‌నాడు- కేర‌ళ‌- నార్త్ ఇండియా వివారాలపై కూడా ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి వుంది.

ఓవ‌ర్సీస్ లో 18 కోట్ల‌కు అమ్మారు. మొదటిరోజు 7 కోట్లు వ‌సూలైంది. మూడు రోజుల్లో ఎంత క‌లెక్ట్ చేసింద‌న్న‌ది తెలియ‌రాలేదు. సైరా వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్ 152 కోట్ల 90 ల‌క్ష‌లు. ఉత్త‌రాది సొంత రిలీజ్ క‌లుపుకుని 200కోట్ల వ‌ర‌కూ జరిగింద‌న్న లెక్క‌లు వేశారు. సైరా 200కోట్ల వ‌సూళ్లు సాధించాల్సి ఉండ‌గా.. ఇప్ప‌టికే 100కోట్ల షేర్ మార్కును అందుకుంది. మ‌రో నాలుగు రోజుల సెల‌వులు ఈ చిత్రానికి క‌లిసి రానున్నాయి.  ఈ రోజు విడుద‌లైన `చాణ‌క్య‌` కార‌ణంగా కొన్ని థియేట‌ర్ల‌లో తొలిగించినా స్టిల్ `సైరా` క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో మూడ‌వ రోజు నుంచి వ‌సూళ్లు ఇంకా పెరుగుతాయ‌నే అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News