ఇటీవల టాలీవుడ్ భారీ చిత్రాల ట్రైలర్లకు విదేశాల నుంచి తొలి రివ్యూ వెలువడుతోంది. అప్పట్లో `సాహో` ట్రైలర్ కి తొలి రివ్యూ వచ్చింది విదేశీ గడ్డ నుంచే. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధూ `సాహో`పై చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలానే `సైరా` ట్రైలర్ గురించి ఆయన రివ్యూ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్తిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 18న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈ వెంట్ ని చిత్ర బృందం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో నిర్వహించబోతోంది. ఇదే వేదికపై `సైరా` థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి ముందే యూకే బేస్డ్ ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్.. యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సందూ `సైరా` ట్రైలర్ పై ట్వీట్ రివ్యూని ఇచ్చారు. అతడు ఇచ్చిన తొలి రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
``సైరా` థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఫెంటాస్టిక్.. మైండ్ బ్లోయింగ్... మెగాస్టర్ చిరంజీవి మనసు దోచేశాడు. ట్రైలర్ అంతా ఆయన ప్రతిభే కనిపిస్తోంది. హీ ఈజ్ స్టోలెన్ ది షో. అద్భుతమైన స్టార్ కాస్ట్ కుదిరింది. `సైరా` షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం`` అని తన తొలి రివ్వూని రివీల్ చేశాడు. ఈ రివ్యూ అంచనాల్ని పెంచుతోంది. అయితే అప్పట్లో `సాహో` ట్రైలర్ గురించి ఆయన చెప్పినది నిజమే. కానీ సినిమాగా చూశాకే కంటెంట్ లేదని సమీక్షకులు తేల్చిన సంగతిని గుర్తు చేసుకోవాలి. అయితే `సైరా` విషయంలో ఎంతో అనుభవజ్ఞులైన చిరంజీవి- రామ్ చరణ్- సురేందర్ రెడ్డి బృందం ఆ తప్పు చేయలేదనే భావించాల్సి ఉంటుంది. కంటెంట్ పరంగానూ థియేటర్లలో మెప్పిస్తారనే అంచనా ఉంది.
ఈ చిత్రంలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. అయనకు గురువుగా గోసాయి వెంకన్నగా కీలక అతిథి పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా.. నయనతార- తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి- జగపతిబాబు- సుధీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు. హిందీ వెర్షన్ ని మాత్రం తడానీలతో కలిసి ఎక్సెల్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ అధినేత ఫర్హాన్ అక్తర్ రిలీజ్ చేస్తున్నారు.