సైరా డే1 వ‌ర‌ల్డ్‌ వైడ్ క‌లెక్ష‌న్స్!

Update: 2019-10-04 05:13 GMT
గాంధీ జ‌యంతి కానుక‌గా రిలీజైన `సైరా న‌ర‌సింహారెడ్డి` వ‌ర‌ల్డ్ వైడ్ తొలిరోజు వ‌సూళ్ల వివ‌రాలు అందాయి. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కిన సినిమా కావ‌డం.. ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ ఉయ్యాల‌వాడ న‌ర‌సిహారెడ్డి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్ప‌డింది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా సాధించిన గ్రాస్.. షేర్ క‌లెక్ష‌న్స్ వివ‌రాలివి.

ఏరియా వారీగా గ్రాస్ ప‌రిశీలిస్తే... ఆంధ్రా-33.8కోట్ల గ్రాస్.. నైజాంలో 12.2 కోట్ల గ్రాస్ వసూలైంది. ఓవ‌రాల్ గా ఏపీ తెలంగాణ గ్రాస్ 52.6 కోట్ల గ్రాస్‌గా తేలింది. క‌ర్నాట‌క‌-10.5కోట్లు..త‌మిళ‌నాడు 1.3కోట్లు.. కేర‌ళ 50ల‌క్ష‌లు.. ఇత‌ర భార‌త‌దేశం 3.1కోట్లు.. ఓవ‌రాల్ ఇండియా 68కోట్లు.. అమెరికా కెన‌డా 8.4కోట్లు మేర గ్రాస్ వ‌సూలు చేసింది. ఇత‌ర ప్ర‌పంచ దేశాల నుంచి 5కోట్ల గ్రాస్ వ‌సూలైంది. ఓవ‌రాల్ గా  ప్ర‌పంచ‌వ్యాప్త‌ వ‌సూళ్లు 81.40 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది.

ప్ర‌పంచ‌వ్యాప్త షేర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే.. వైజాగ్ 4.64 కోట్లు.. తూర్పుగోదావ‌రి-4.75 కోట్లు... ప‌శ్చిమ‌గోదావ‌రి- 4.02 కోట్లు.. కృష్ణా-3.04 కోట్లు.. గుంటూరు 2.09 కోట్లు.. నెల్లూరు-2.09కోట్లు.. సీడెడ్ 5.54కోట్లు వ‌సూలైంది. ఆంధ్రా నుంచి 23.6 కొట్లు ..నైజాం 8.14కోట్లు షేర్ వ‌సూలైంది. క‌ర్నాట‌క 6.39కోట్లు.. త‌మిళ‌నాడు 60ల‌క్ష‌లు.. కేర‌ళ 20ల‌క్ష‌లు.. ఇత‌ర భార‌త‌దేశం 1.21 కోట్లు.. మొత్తం ఇండియా 46కోట్లు షేర్ వ‌సూలైంది. అమెరికాల 4.2కోట్లు.. ఇత‌ర ప్ర‌పంచంలో 2కోట్లు వ‌సూలైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 52కోట్ల షేర్ వ‌సూలు చేసింది. నెట్ ప‌రంగా చూస్తే ఏపీ నైజాం 47.3కోట్లు.. మొత్తం ఇండియాలో 60.6 కోట్లు వ‌సూలైంది.


Tags:    

Similar News