సౌత్ నుంచి బాలీవుడ్ కి జంప్ చేసిన తాప్సీ ముంబై పరిశ్రమలో ఒక్కో అడుగు తెలివిగా వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి అడుగులో తాప్సీకి గుర్తింపు పెరుగుతోందే కానీ చెత్త పెర్ఫామర్ అన్న నెగెటివ్ టాక్ మాత్రం లేదు. నెమ్మదిగా ఈ భామకు ఓ స్థానం ఏర్పడింది. తనకంటే ముందే సౌత్ నుంచి ఎందరో భామలు వెళ్లినా వాళ్లలో ఎవరూ సాధించలేనిది తాప్సీ సాధిస్తోంది. అశిన్, కాజల్, తమన్నా, త్రిష వంటి భామలు కేవలం గ్లామరస్ పాత్రలకే అంకితమైతే తాప్సీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చే పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతిభావని గా మార్కులు కొట్టేస్తోంది.
పింక్, నామ్ షబానా, మన్మార్జియాన్ వంటి చిత్రాలతో తాప్సీ విజయాలు అందుకుంది. ఆ మూడు సినిమాల్లో మహిళగా బలమైన ముద్ర వేసే పాత్రల్ని ఎంపిక చేసుకుంది ఈ పంజాబీ బ్యూటీ. ఆ క్రమంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా తాప్సీ నటించిన `బద్లా` మూవీ రిలీజైంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వ ం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ తో కలిసి అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుందని పేరొచ్చింది. ఇటీవలే రిలీజైన బద్లా చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్ప ందనలు వచ్చాయి.
తాప్సీ ఈ చిత్రంలో నైనా సేథి అనే బిజినెస్ ఉమెన్ పాత్రలో నటించింది. ఓ హత్య నేపథ్య ంలో ఆద్య ంతం ఉత్క ంఠ కలిగించే ట్విస్టులు, టర్నులతో సుజోయ్ ఈ చిత్రాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు వచ్చాయి. ఎవరు ఏమిటి? అన్నది అర్థం కాని ట్విస్టులు వెంటాడతాయట. ఈ చిత్రంలో తాప్సీతో పాటు అమృత సింగ్ ఓ కీలక పాత్రలో నటించారు. స్పానిష్ సినిమా `ఇన్విజిబుల్ గెస్ట్` ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఓపెనింగ్ డే ఉన్న జోష్ ఆ తర్వాత కూడా వసూళ్లలో ఉంటుందా? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం అందుకుంటుంది? అన్నది కాస్త వేచి చూస్తే కానీ చెప్పలేం. అసలైన పరీక్ష సోమవారం నుంచి ఉంటుంది కాబట్టి పబ్లిక్ లో వాస్తవ రిపోర్ట్ ఏంటి? అన్నది వేచి చూడాలి.