బీచ్ సిటీలో తాప్సీ ఏం చేస్తోందంటే

Update: 2016-05-10 07:46 GMT
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను కెరీర్ ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ లో కొనసాగుతోంది. కెరీర్ మొత్తంలో దక్కని గుర్తింపును ఒకే ఒక్క మూవీతో అనూహ్యంగా దక్కించుకున్న తాప్సీ.. ఇప్పుడు నేషనల్ వైడ్ గా బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్ అయిపోయింది. అది కూడా డిఫరెంట్ కాన్సెప్టులు అమ్మడి తలుపుతు తడుతున్నాయి.

ప్రస్తుతం రాణాతో కలిసి ఘాజీ అనే సౌత్ మూవీలో చేస్తున్న తాప్సీ.. అమితాబ్ బచ్చన్ కలిసి పింక్ లోనూ నటిస్తోంది. వీటితో పాటు ఇప్పుడో మ్యూజిక్ వీడియోలో అమ్మడికి ఛాన్స్ వచ్చింది. షాన్ పాడుతున్న ఈ రొమాంటిక్ ఆల్బం కోసం ఇప్పుడు షూటింగ్ లో పాల్గొటోంది తాప్సీ. ఈ పాటలో మోస్ట్ గ్లామర్ గా నటించనుండడమే కాదు.. రకరకాల టచప్ లు కూడా ఇస్తోంది తాప్సీ. ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే లవ్ స్టోరీగా ఆ ఆల్బం తెరకెక్కనుండగా.. ప్రస్తుతం గోవాలో బీచ్ ఒడ్డున దీని షూటింగ్ జరుపుతున్నారు. వీపంతా కనిపించేలా డ్రసింగ్ - వీపుపై పెద్ద టాటూతో ఈ భామ కనిపించనుంది.

మ్యూజిక్ వీడియో అంటే 3-4 నిమిషాల్లోనే స్టోరీ అంతా చెప్పాలని.. అనేక ఎమోషన్స్ ను తక్కువ టైంలో చూపించే ఆస్కారం ఉంటుందని తాప్సీ అంటోంది. ఈ ఆల్బంలో నటించేందుకు సైన్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్ అంటోంది తాప్సీ. యాక్టింగ్ తనకు అలవాటయిన పనే అయినా.. మ్యూజిక్ వీడియోలో చేయడం మాత్రం ఓ కొత్త అనుభూతిగా చెబుతోంది ఈ ఢిల్లీ బ్యూటీ.
Tags:    

Similar News