ఆ నిర్మాతకే పందెంకోడి-2 హక్కులు..

Update: 2018-07-13 09:05 GMT
తమిళ హీరో విశాల్ ఇప్పుడు వరుసహిట్స్ తో ఇండస్ట్రీని ఆకర్సిస్తున్నాడు. ఆయన తీసిన ప్రతి సినిమా హిట్ అవుతూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఇటీవలే డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో విశాల్ ఫామ్ లోకి వచ్చాడు. అభిమన్యుడు సినిమా తెలుగు నాట కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే విశాల్ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించాడు.

విశాల్ కెరీర్ లోనే ‘పందెంకోడి’ పెద్ద హిట్.  ఈ సినిమా సీక్వెల్ పందెంకోడి2 కు విశాల్ పచ్చజెండా ఊపారు. మొదటి సినిమాను తీసిన లింగుస్వామి దర్శకత్వంలోనే ఈ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు.  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 18న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

తమిళంలో రూపొందుతున్న ‘పందెంకోడి2’ తెలుగు హక్కులను నిర్మాత ఠాగోర్ మధు చేజిక్కించుకున్నాడు. అయితే ఎంత మొత్తానికి తీసుకున్నాడన్నది అధికారికంగా తెలియరాలేదు. పదికోట్ల వరకూ చెల్లించాడని వార్తలొచ్చాయి.  తెలుగు వెర్షన్ థియేటర్స్, శాటిలైట్ అన్నీ కలిపి ఈ రేటును కన్ఫం చేశారని అంటున్నారు.

అయితే పందెంకోడి2 హక్కులు ఠాగోర్ మధుకు రావడం వెనుక విశాల్ హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.  విశాల్ పందెంకోడి2 తర్వాత ఠాగోర్ మధు నిర్మాణంలోనే తెలుగులో హిట్ అయిన టెంపర్ మూవీ రిమేక్ లో నటిస్తున్నారు. ఆ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.. ఈ నేపథ్యంలోనే తన పందెంకోడి2 హక్కులను ఠాగోర్ మధుకు ఇచ్చారనే వార్తలు వెలువడ్డాయి.


Tags:    

Similar News