తేజు ఫాన్స్ టెన్షన్ టెన్షన్

Update: 2018-06-27 05:29 GMT
జులై 6 గురించి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలా వర్రీగా ఉన్నాడు. కారణం తన మార్కెట్ అంతకంతకు కుంచించుకుపోతున్న తరుణంలో ఆశా కిరణంలా తేజ్ ఐ లవ్ యు సినిమాను చూసుకుంటున్నాడు. ఇప్పటికే ట్రైలర్ తో సహా ఆడియో కూడా విడుదలైపోయింది. అదిరిపోయింది అనే మాట ఫాన్స్ నుంచి కూడా రాలేదు. ఇక సామాన్య ప్రేక్షకుల అభిప్రాయం చెప్పనక్కర్లేదు. తేజు ఫాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. దర్శకుడు కరుణాకరన్ మారిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకోకుండా తన పాత స్కూల్ లోనే దీన్ని తీయటం వాళ్ళ అసంతృప్తికి కారణం. అమ్మాయిని పడేయడానికి తేజుతో చెప్పించిన అరిగిపోయిన ఫార్ములా డైలాగ్ విన్నప్పుడే వాళ్లలో అనుమానం మొదలైంది. దానికి తోడు కరుణాకరన్ గత సినిమాలు డార్లింగ్-ఉల్లాసంగా ఉత్సాహంగా-ఎందుకంటే ప్రేమంట సినిమాల ఛాయలు స్పష్టంగా ఉండటం ఖంగారుని ఇంకా పెంచుతోంది.

ఇలాంటి సాఫ్ట్ లవ్ స్టోరీస్ కు ఓవర్ సీస్ మార్కెట్ చాలా ముఖ్యం. కానీ ఇప్పటి దాక రొటీన్ మాస్ మసాలాలు చేసిన సాయి ధరమ్ తేజ్ కి అక్కడ మార్కెట్ జీరో. మెగా హీరో అన్న సాఫ్ట్ కార్నర్ కూడా లేదు. ఇక్కడ విరగాడేసాయి అని చెప్పుకునే పిల్లా నువ్వు లేని జీవితం-సుప్రీమ్ యుఎస్ లో తెచ్చిన వసూళ్లు అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో తేజ్ ఐ లవ్ యు అనే టైటిల్ వాళ్ళను ఆకర్షిస్తుంది అనుకుంటే ఆ అవకాశం కూడా  లేనట్టు కనిపిస్తోంది. సినిమాపై అంచనాలు లేకపోవడం ఇప్పటికే ఓపెనింగ్స్ పరంగా మైనస్ కాబోతుండగా  టాక్ అద్భుతంగా వస్తే తప్ప ఈ సినిమా బలంగా నిలవడం కష్టం.

అప్పుడెప్పుడో పవన్ తో తీసిన  తొలిప్రేమను చూసుకుని ఇప్ప్పుడు కూడా కరుణాకరన్ అదే మేజిక్ రిపీట్ చేస్తాడనుకోవడం కరెక్టా కదా అనేది మరో వారం తర్వాత తేలిపోతుంది. అసలే గోపిచంద్ పంతం అంటూ ఒకరోజు ముందు వస్తున్నాడు. మాస్ సబ్జెక్టు అయిన దానికి తేజ్ ఐ లవ్ యుతో నేరుగా పోటీ లేకపోయినా టాక్ ని బట్టి ప్రభావం చూపించే అవకాశం ఉంది. తేజ్ టెన్షన్ క్లియర్ అవ్వాలంటే జులై 6 దాకా వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News