తమన్నాకి ఆ ఛాన్స్ రాలేదట

Update: 2015-11-05 13:30 GMT
స్టార్ హీరోయిన్ గా ఎదిగాక.. కొన్ని పనులు చేద్దామన్నా కుదరవు. ఎంత ఇష్టమైనా, వాటిపై ఎంతటి మనసున్నా చేయాలంటే కుదరదు. ఓవైపు స్టార్ స్టేటస్ మరోవైపు నలుగురూ గుమిగూడతారనే ఆలోచన, ఇంకోవైపు పదిమందినీ ఇబ్బంది పెట్టాల్సి వస్తుందనే బాధ. వీటన్నిటితో ఇష్టమైన వాటికి దూరమవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది స్టార్ హీరోయిన్లకి. తమన్నా పరిస్థితి కూడా ఇదేనట. మిల్కీ బ్యూటీగా సౌత్ లోనే కాదు... బాహుబలితో బాలీవుడ్ లోనూ బాగా పాపులారిటీ సంపాదించింది తమ్మూ.

ఎంత ఎదిగినా.. ఈమెకు మాత్రం.. రోజువారీగా చేసే చిన్నచిన్నపనులంటే చాలా ఇష్టమట. కుటుంబంతో గడుపుతూ ఎంజాయ్ చేయాలని ఉంటుందట. అంతేకాదు.. థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడ్డం, రోడ్ పక్కన దొరికే ఫుడ్ తినడం, రోడ్ సైడ్ షాపింగ్ లాంటివి బాగా ఎంజాయ్ చేస్తుందట మిల్కీ బ్యూటీ. అయితే. ఇలా చేసేందుకు లభించిన అవకాశాలు మాత్రం చాలా తక్కువేనని తేల్చేసింది. కారణం చిన్నప్పుడే కెరీర్ ప్రారంభమైపోవడాన్ని కారణంగా చెప్పచ్చు. తన 13 ఏళ్ల వయసులోనే కెరీర్ స్టార్ట్ చేసేసింది తమ్మూ. ముందుకొన్ని యాడ్స్ - తర్వాత ఓ మూవీలో ఛాన్స్.. ఇలా కంటిన్యూ అయిపోయింది. 3-4 ఏళ్ల తర్వాత టాలీవుడ్ - కోలీవుడ్ లలో ఛాన్సులు పలకరించాయి.

ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్స్ రావడం, వాటిలో యాక్ట్ చేసుకుంటూ తన స్థాయిని పెంచుకోవడంలో చాలా టైం గడిచిపోయిందని చెప్పింది తమన్నా. తనో డాక్టర్ - యాక్టర్ కావాలని కోరుకుందట. అయితే.. కెరీర్ ఇటువైపే లాక్కెళ్లడంతో డాక్టర్ కల అలాగే మిగిలిపోయింది. ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఐఎఫ్ ఏ అవార్డ్ ఫంక్షన్ కి ప్రచారకర్తగా ఉండడం ఫుల్ హ్యాపీగా ఉందంటోంది మిల్కీ. ముఖ్యంగా అనేక విభాగాల్లో బాహుబలి నామినేట్ కావడంతో.. ఎగ్జయింటింగ్ గా ఉందట.
Tags:    

Similar News