తమ్మూ అంత మాట అనేసిందేంటీ

Update: 2015-12-16 15:30 GMT
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ రంగం. ఈ పరిశ్రమలో హీరోయిన్లను అందాల ఆరబోతకే ఉపయోగించుకుంటున్నారన్న మాట ఇప్పటిదేం కాదు. అయితే.. టాలీవుడ్ లో మాత్రం మరీ ఎక్స్ పోజింగ్ కి మాత్రమే హీరోయిన్స్ అన్నట్లుగా చూపించడం తగ్గిందనే చెప్పాలి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన బెంగాల్ టైగర్ - లేటెస్ట్ మూవీ లోఫర్ పోస్టర్లలో మాత్రం హీరోయిన్స్ ని బాగా వాడేశారు.

రవితేజ మూవీ బెంగాల్ టైగర్ లో తమన్నా - రాశి ఖన్నా గ్లామర్ కురిపించేశారు. ముందునుంచే నాన్ వెజ్ మూవీ అని చెప్పి పోస్టర్లలో కూడా ఆ విషయాన్ని ఇండికేట్ చేశారు. లోఫర్ హీరోయిన్ పోస్టర్స్ కూడా దగ్గర దగ్గర అదే బాపతుగా ఉన్నాయి. హీరోయిన్స్ అంటే అందాల ఆరబోతకే అంటేనా మిల్కీ బ్యూటీ తమన్నా నుంచి వెరైటీ ఆన్సర్ వచ్చింది. "నా సినిమాల్లో గ్లామర్ పెర్ఫామెన్స్ రెండూ సమపాళ్లలోనే ఉండేలా చూసుకుంటున్నా. వీటిని బ్యాలెన్స్ చేస్తూనే సినిమాలు చేస్తున్నా. ఇది సినిమా బిజినెస్. ప్రేక్షకులకు కావాల్సింది ఇవ్వాల్సిందే" అంటోంది తమ్మూ. అంతేకాదు "సినీ పరిశ్రమ మహిళలను చిన్నచూపు చూస్తోందనే మాట నేను ఒప్పుకోను. అలా మమ్మల్ని విమర్శించేవారికే  అలాంటి భావం ఉంది. వాళ్లకు వాస్తవం తెలీదు" అనేసింది.

అంతకు ముందు చాలామంది హీరోయిన్స్ చెప్పిన మాటనే కాసింత తన ట్యాలెంట్ జోడించి చెప్పిందంతే. కానీ ఈ కామెంట్స్ తో ఒకటి మాత్రం అర్ధం చేసుకోవాలి. ఇలాంటి ఎక్స్ పోజింగ్ లు లాంటి వాటిపై తమ్మూకి ఎలాంటి అబ్జక్షన్స్ లేవనే విషయం స్పష్టమైపోతోంది. అవన్నీ కెరీర్ లో ఓ పార్ట్ మాత్రమే అన్నది తమ్మూ మాటల్లోని సారాంశం.

Tags:    

Similar News