తమన్నా వార్డ్ రోబ్ లో ఏముంది?

Update: 2015-10-04 01:30 GMT
తమన్నా భాటియా.. మిల్కీ బ్యూటీ అనీ, బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అన్ని ఇండస్ట్రీల్లోనూ స్టార్ లీగ్ లో ఉన్న హీరోయిన్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ తమన్నా ఒరిజినల్ గా ఎలా ఉంటుంది? ఇంట్లో ఎలాంటి మేకప్ తో ఉంటుంది? మిల్కీబ్యూటీకి నచ్చే ఫ్యాషన్ ఏంటి ? ఏ బ్రాండ్స్ ఉపయోగిస్తుంది? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి?

స్టైలింగ్: కంఫర్ట్ గా ఉండడంతో పాటు ప్రయోగాలు చేస్తాను, అనేక రకాల లుక్స్ ట్రై చేస్తా, అనార్కలీస్ - కుర్తీస్ - ట్యూనిక్స్ వంటి ఇండియన్ డ్రస్సులు బాగా ఇష్టం. మంచి ట్రెడిషనల్ లెహంగా వేసుకోవాలని ఉంది కానీ.. దాని కోసం ఇప్పుడు నేను పెళ్లి చేస్కోవాలి.. ప్చ్.

ఫ్యాషన్: రిప్డ్ జీన్స్ చాలా ఇష్టం, ఇప్పటివి వాటిని ఎన్ని వందల సార్లు షాపింగ్ చేశానో తెలీదు. జాకెట్స్ - షూస్ కూడా బోలెడు కొంటాను. లిప్ స్టిక్స్ - మీనియేచర్స్ - మేకప్ ప్రొడక్ట్స్ కలెక్షన్ కూడా నా దగ్గర చాలా ఉంది.

ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే: ట్రాక్ ప్యాంట్స్ -  టీ షర్ట్ - చెప్పల్స్ - అంతే నా డ్రెసింగ్. ఒకే ప్యాట్ పై టీ షర్టులు మార్చేస్తుంటా. బాయ్ ఫ్రెండ్ బ్రాండ్ జీన్స్ నాకు చాలా ఇష్టం

షాపింగ్ ఎక్కడ ఇష్టమంటే: పారిస్.. షాపింగ్ చేయడానికి ఈ ప్లేస్ కి పోటీ లేదంతే. అక్కడ కాండీషాప్ కి వెళ్లినపుడు నేను చిన్నపిల్లలా ఫీలవుతా. నేనింకా అక్కడే ఉంటే.. వాళ్లీపాటికి దివాలా తీసేసేవాళ్లు.

కలర్స్ ఏవి ష్టం: బ్రైట్ కలర్స్ బాగా ఇష్టం - న్యూట్రల్ షేడ్స్ లో నన్ను చాలా తక్కువ సార్లు చూసుంటారు కదా.!

ఫేవరేట్ బ్రాండ్స్: ఫరెవర్ 21 - జారా - హెచ్ అండ్ ఎంలతోపాటు  మరి అండ్ కట్రాంజు వంటి హైఎండ్ స్టోర్స్. మేకప్ లో అయితే బబ్ల్ బ్రౌన్ - నార్స్ - ఛానెల్

ఎలా రెడీ అవుతారో: నేను చాలా స్పీడ్. ప్రమోషన్ ఈవెంట్స్ కయితే 15 నిమిషాల్లో హెయిర్ - మేకప్ - శారీతో సిద్ధమైపోగలను.

ఫ్యాషన్ లో డిజాస్టర్: ఓ సారి టైట్ గౌన్ తో ఫంక్షన్ కు అటెండ్ అయ్యా, ఊపిరి కూడా ఆడలేదు. ఇంకోసారి అలాంటి గౌన్స్ వేసుకోకూడదని ఫిక్సయ్యా.
Tags:    

Similar News