ఫోటో స్టోరి: తిలోత్తమ తమన్నా

Update: 2018-02-03 17:31 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా మళ్లీ తన రేంజ్ చాటేందుకు రెడీ అయిపోతోంది. క్వీన్ రీమేక్ తో అలరించనున్న ఈ భామ.. ఇప్పటికీ తరగని అందంతో మెరిసిపోతూనే ఉంది. తన అందాలను పదిలంగా ఏళ్ల తరబడి కాపాడుకోవడమే కాదు.. వాటిని ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించాలో కూడా తమ్మూకి బాగానే తెలుసు.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో భాగంగా ఈ పాలనురుగు మాదిరిగా మెరిసే ఈ సుందరి.. ర్యాంప్ పై సందడి చేసింది. తిలోత్తమ అనే కలక్షన్లో సౌందర్యాన్ని ధారబోసింది తమన్నా. అశ్విని రెడ్డి అనే డిజైనర్ కోసం హంస నడకలు నడిచి.. ర్యాంప్ ను షేక్ చేసేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోకు కుప్పలు తెప్పలుగా లైక్స్ వచ్చేయడం.. కామెంట్స్ పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. నడుం అందాలను ఆ రేంజ్ లో చూపించేసి.. ఫ్యాషన్ లో తన స్టైలింగ్ ఎలా ఉంటుందో చూపించేసింది. డ్యాన్సుల్లో ఈ భామ అంతగా ఎలా మెలికలు తిరిగిపోగలదో.. ఇక్కడ కనిపించే నడుం కొలతలు చూస్తే అర్ధమవుతుంది.

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు.. తమన్నాస్పీక్స్ అనే పేరు పెట్టుకుంది. ఇలాంటి గ్లామరస్ ఫోటోలు చూస్తుంటే మాత్రమే.. ఆమె మాట్లాడనక్కరలేదు.. ఆమె అందాలే స్పీకింగ్ అంటూ అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు. ఏమైనా అందాల భామలు ఏం చేసినా అందంగానే ఉంటుందబ్బా!


Tags:    

Similar News