జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవకుశ థియేటర్లలోకి వచ్చేస్తోంది. మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే.. ఎన్టీఆర్ గత చిత్రం జనతా గ్యారేజ్ లో కాజల్ మాదిరిగానే.. ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేసిన తమన్నా.. ప్రచారంలో తెగ హడావిడి చేసేస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య కాలంలో సరైన బ్రేక్ రాలేదు. బాహుబలి2 సక్సెస్ తమ్మూకు ఏ మాత్రం హెల్ప్ కాలేదు. అందుకే జై లవకుశలో చేసిన ఐటెం పాటతో మళ్లీ ఫాంలోకి వచ్చేయాలని తెగ తాపత్రయపడుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్-తమన్నాలపై షూట్ చేసిన సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. "ఊసరవెల్లి తర్వాత ఎన్టీఆర్ కలిసి మళ్లీ నటించిన మూవీ ఇది. ఒక పాటలో మాత్రమే కనిపించినా.. ఇది చాలా ఫన్ క్రియేట్ చేసే సాంగ్. షూటింగ్ సమయంలోనే చాలా ఎగ్జైట్ అయ్యాం. అంత అద్భుతంగా ఉంటుందీ పాట. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ అంతా స్క్రీన్ పై చూస్తారా అనే ఆతృతతో ఉన్నాను. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేసే క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను" అంటోంది తమన్నా.
ఈ ఐటెం సాంగ్ ప్రోమోకు ఇప్పటికే మిలియన్ వ్యూస్ దాటిపోగా.. ఈ పాటను కొత్తగా ట్రై చేశానంటున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. 'ఎలక్ట్రానిక్ ఫోక్.. లేదా టెక్నో-ఫోక్ అని ఈ పాటను పిలవాల్సి ఉంటుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సూపర్బ్ డ్యాన్స్ నెంబర్. విజువల్స్ అద్భుతంగా కుదిరిన ఈ పాట థియేటర్లను దద్దరిల్లేలా చేయడం ఖాయం' అంటున్నాడు డీఎస్‌పీ.