మిల్కీ బ్యూటీ తమన్నా ఒకేసారి మూడు భాషల్లో చేసేస్తూ.. బాగానే కెరీర్ కంటిన్యూ చేస్తోంది. తెలుగు - తమిళ్ - హిందీల్లో ఏ ఇండస్ట్రీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా.. అన్నిచోట్లా మేనేజ్ చేసేస్తోంది. త్వరలో నాగ్ - కార్తిలతో కలిసి నటించిన ఊపిరితో తెలుగు - తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్న తమ్మూ.. ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి హిందీ - తమిళ్ - తెలుగు భాషల్లో రూపొందుతున్న ఓ మూవీలో కూడా నటిస్తోంది. ఇందులో తన డ్యాన్సింగ్ ఇన్ స్పిరేషన్ - గాడ్ అయిన ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేయనుండడంతో తెగ హ్యాపీగా ఉంది తమన్నా.
'చాలామంది ఇది హారర్ ఫిలిం అనుకుంటున్నారు. కానీ ఇది థ్రిల్లర్. హారర్ చిత్రాల్లో అసలైన క్షణం వచ్చే వరకూ డల్ గా ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ మూవీలో ఒక్కక్షణం కూడా స్లోగా సాగే నేరేషన్ ఉండదు. ఫన్ థ్రిల్లర్ అని దీని చెప్పుకోవచ్చు' అంటూ కొత్త సినిమా సంగతులు చెప్పిన తమ్మూ.. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ధర్మదురై చిత్రంలో ఓ డీగ్లామర్ రోల్ కూడా చేస్తోంది.
అనేక భాషల్లో చేయడం కూడా పెద్ద మ్యాటర్ కాదని ఫీలవుతోందీ వైట్ బ్యూటీ. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ కి, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి జర్నీ చేస్తున్న హీరోయిన్స్ ని ఉదాహరణగా చూపిస్తోంది. గత ఐదేళ్లలో తెలుగులో ఏడు సినిమాలు చేస్తే అందులో రచ్చ - తడాఖా - బాహుబలి మాత్రమే హిట్ అయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితి అందరికీ వస్తోంది. నిర్మాతలకు డబ్బులు తెచ్చే సినిమాల్లోనే చేయాలని ఉన్నా.. అన్నిసార్లు సాధ్యం కాదుగా ఉంటుంది. అందుకే ఒకవేళ సినిమా ఫెయిల్ అయినా.. ఉత్సాహం తెచ్చుకుని అడుగులు వేస్తా అంటోంది మిల్కీ.