పికాసో చిత్ర‌మా.. ఎల్లోరా శిల్ప‌మా?

Update: 2018-09-30 01:30 GMT
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్..
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్..
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా..
నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా..
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా..

ఈ అందాన్ని ఇంత‌కుమించి వ‌ర్ణించినా త‌ప్పేమీ కాదు. పికాసో మ‌ళ్లీ జ‌న్మిస్తే ఈ అంద‌గ‌త్తె కోసం ప‌రుగెత్తుకొచ్చేవాడేమో! అంతందంగా మిల్కీ వైట్ బ్యూటీని తీర్చిదిద్దిన ఆ ఫేమ‌స్ ఫోటోగ్రాఫ‌ర్‌ని ప్ర‌శంసించి తీరాల్సిందే. అస‌లే క్వీన్ పాత్ర‌లో త‌ళుకులీనబోతోంది. `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి` అని కుర్రాళ్లు కేరింత‌లు కొట్ట‌డం ఖాయం అన్న‌ట్టే ఉందీ వ్య‌వ‌హారం.

ఆ ముక్కుకు ముక్కెర‌.. అందంగా ఆర‌బోసిన‌ కురులు .. టాప్ టు బాట‌మ్ డ్రెస్సింగ్ సెన్స్‌.. ఆ చేతి కొన‌ల‌ను అల్లుకున్న డిజైనింగ్ జువెల‌రీ ప్ర‌తిదీ సంథింగ్ అని పొగిడేయ‌కుండా ఉండ‌లేం. మిల్కీ బ్యూటీ నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ ఇది. 100ప‌ర్సంట్ ల‌వ్ చేసి, ఏ+బి వోల్ స్క్వేర్ = మిల్కీ  బ్యూటీ త‌మ‌న్నా! అని పార్ములా మార్చుకునే టైమొచ్చింది!! ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి, ఎఫ్ 2 - సైరా చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉందీ భామ‌. త‌మిళంలోనూ ప‌లు క్రేజీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. ప్ర‌భుదేవా స‌ర‌స‌న‌ ఓ ద్విభాషా చిత్రంలోనూ న‌టిస్తోంది.
   

Tags:    

Similar News