మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య పెద్ద షాక్ ఇచ్చింది. ధర్మదురై అనే తమిళ్ మూవీ కోసం తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించేసుకుంది. సాధారణంగా కోటిన్నర వరకూ ఛార్జ్ చేసే తమన్నా.. ఈ మూవీ కోసం పట్టుమని 40 లక్షలు కూడా తీసుకోవడం లేదని టాక్. స్టోరీ బాగుండడం, తమ్మూకి పెర్ఫామెన్స్ బేస్డ్ రోల్ ఉండడం, మంచివైన చిన్న సినిమాలకు కూడా తను అందుబాటులో ఉండాలని భావించడంతోనే.. ఇలా రెమ్యూనరేషన్ లో కోత పెట్టుకుంది మిల్కీ.
మన టాలీవుడ్ విషయానికొస్తే.. తమన్నా చేసినవన్నీ అందాల ఆరబోతలే. పెర్ఫామెన్స్ అనే మాట మచ్చుకు కూడా కనిపించదు. గ్లామర్ డాల్ రోల్ తప్ప వేరే ఛాన్స్ ఇచ్చేందుకు మనోళ్లు ముందుకు రావడం లేదు. ఇందుకోసం పారితోషికం కూడా ఎక్కువగానే ఛార్జ్ చేస్తోంది తమన్నా. కోటిన్నర తీసుకుని.. అందుకు తగ్గట్లుగానే గ్లామర్ ఒలకబోసేస్తోంది. మరి టాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్స్ తో.. తమ్మూని కాంటాక్ట్ చేస్తే, ఇలా రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు సడలించదా అనే ప్రశ్న తలెత్తుతుంది.
అయితే.. హీరోయిన్ కి పెర్ఫామెన్స్ బేస్డ్ పాత్రలు ఉండాలి కదా, ఆ మేరకు రైటర్స్ అయినా రాయాలి కదా. మన సినిమాల్లో హీరోయిన్ ఏం చేస్తుందో, ఏం చేయగలదో చూస్తూనే ఉన్నాం. బడ్జెట్ ఎక్కువయిపోయింది. హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గా చూపిస్తున్నారు అని అనే బదులు.. ఇలాంటి మంచి రోల్స్ క్రియేట్ చేసే కల్చర్ రావాల్సి ఉంది. అప్పుడు బడ్జెట్ లోనే టాప్ హీరోయిన్స్ కూడా సినిమాల్లో భాగం అయ్యే అవకాశం ఉంటుందని.. తమ్మూ ఇన్సిడెంట్ తో అర్ధమవుతుంది.