వెండితెర మీద హీరోయిన్ గా తళుక్కుమనటం.. ఆ వెంటనే మాయమైపోవటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా అప్పుడెప్పుడో వచ్చి.. ఇప్పటికి హీరోయిన్ గా కంటిన్యూ చేయటమేకాదు.. రూపంలోనూ.. ఒంపుసొంపుల్లోనూ ఏ మాత్రం తేడా రాకుండా మొయింటైన్ చేయటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన తోటి తారలు ఎంచక్కా పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనేసేందుకుప్లాన్ చేస్తున్న వేళ.. మిల్కీబ్యూటీ తమన్నా మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు.
అప్పుడెప్పుడో 2005లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. హీరోయిన్ గా నాన్ స్టాప్ గా పాత్రలు పోషిస్తూనే ఉంది. ఈ మధ్యన ఆమెకు డిమాండ్ కాస్త తగ్గిన వైనం తెలిసిందే. మళ్లీ ఇప్పుడామె కెరీర్ గాడిన పడటమే కాదు.. జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉండగా.. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ కావటం గమనార్హం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న తమన్నా.. తాజాగా కన్నడలో ఒక పాన్ ఇండియా మూవీకి.. తెలుగులో ఎఫ్3.. చిరుతో ఒక సినిమాలో జత కట్టేందుకు ఓకే చేసింది. మరికొన్ని ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయి. ఇలా.. వరుసు పెట్టి సినిమాలుచేస్తున్న వేళ..పెళ్లికి టైం లేదని చెబుతోంది.
ఇప్పటికైతే తాను పెళ్లి గురించి ఆలోచించటం లేదని.. మరో రెండేళ్ల వరకు మాత్రం పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టంచేసింది. రెండేళ్ల తర్వాత కచ్ఛితంగా పెళ్లి గురించి ఆలోచన చేస్తానని చెప్పిన ఆమె.. అప్పటి వరకు నో మ్యారేజ్ అన్న విషయాన్ని తేల్చేసింది. తమన్నా తాజా మాటల్ని చూస్తే.. రానున్న రెండేళ్లలో పెళ్లి గురించిన ముచ్చటే లేదన్న విషయాన్ని తేల్చేసిందని చెప్పక తప్పదు.