మిల్కీబ్యూటీ తమన్నా కెరీర్ కంబ్యాక్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. బాహుబలి- సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటించిన లక్కీ లేడీగా పాపులరైంది. ఇటీవలే విశాల్ సరసన నటించి యాక్షన్ మిల్కీకి మంచి పేరు తెచ్చింది. 13 ఏళ్లగా సినిమాలే జీవితంగా భావించిన మిల్కీకి ఏజ్ 30 ప్లస్ లో పడింది.
పెళ్లి ఈడు దాటిపోతోంది. మరి కొత్త జీవితం ఎప్పుడు ప్రారభిస్తారు? అంటూ మిల్కీ వెంట పడుతున్నారు అంతా. మిల్కీని ఇదే విషయమై ఓ కోలీవుడ్ పాత్రికేయుడు ప్రశ్నిస్తే.. తాను పెళ్లికి రెడీగానే ఉన్నట్లు తెలిపింది. మంచి కుర్రాడి కోసం ఎదురుచూస్తున్నారా.. తమిళుడైనా పర్వాలేదా? అని మరోసారి ప్రశ్నను రెయిజ్ చేశాడట ఆ పాత్రికేయడు. దానికి తమన్నా ఆసక్తికరంగానే స్పందించింది. వరుడి క్వాలిటీస్ గురించి చెబుతూ.. కుర్రాడు ఎవరైనా మంచి బుద్ధి.. మంచి గుణగణాలు కలిగిన వాడై ఉండాలి. అలాంటి పెళ్లి కొడుకుని మీరు వెతికినా చేసుకోవడానికి రెడీ అంటూ నవ్వేసింది.
తమన్నాకు ఈ ఇంటర్వ్యూ లో మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తెలుగు.. తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని ప్రశ్నిచంగా రాజకీయాల్లోకి రావాలంటే వేరే లక్షణాలు ఉండాలి. ఆ క్వాలిటీ నాలో లేదు. రాజకీయాలు చేసేంత తెలివి తేటలు నా దగ్గర లేవు అని అంది. పరిశ్రమ అగ్ర హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిపై ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి వారిద్దరు ప్రజలకు మంచి చేస్తారని నమ్ముతున్నాను. వాళ్లిద్దరితో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోను. ఆ ఇద్దరినీ దేవుళ్లు గా కొలుస్తాను. పైకి నాకు కనిపించే దేవుళ్లు వాళ్లేనని తెలిపింది.