తెలుగు నిర్మాతలూ.. వాళ్ల సిన్సియారిటీ చూడండి

Update: 2018-03-11 06:23 GMT
తెలుగు నిర్మాతలు తలపెట్టిన సమ్మె విషయంలో వాళ్ల సిన్సియారిటీ ఎంత అనేది నారాయణ మూర్తి మాటలతోనే తెలిసిపోయింది. ఏదో సాధించేస్తామన్నట్లుగా సమ్మె మొదలుపెట్టి నాలుగు రోజులు తిరక్కుండానే రాజీకి వచ్చేశారని.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వీళ్ల డిమాండ్లకు ఎంతమాత్రం తలొగ్గలేదని.. ముందు చెప్పిన మేరకే రేట్లు తగ్గించారని వివరాలు వెల్లడించడం ద్వారా నిర్మాతల గాలి తీసేశారు నారాయణమూర్తి. ఇక్కడ ప్రస్తావించాల్సిన ఒక కీలక విషయం ఏంటంటే..      మన తెలుగు నిర్మాతల సమ్మెకు మద్దతుగా తమిళ నిర్మాతలు సైతం సమ్మెకు దిగారు. కానీ వీళ్లు అనూహ్యంగా సమ్మె విరమించి వాళ్లకు షాకిచ్చారు.

అంతమాత్రాన తమిళ నిర్మాతలేమీ తగ్గలేదు. సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. రెండో వారం కూడా అక్కడ సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెను మరో స్థాయికి తీసుకెళ్లడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి సినిమా షూటింగులు సైతం ఆపేస్తున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మెడలు వంచడంతో పాటు పరిశ్రమకు సంబంధించి మరి కొన్ని సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి షూటింగులు కూడా ఆపేస్తున్నట్లు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ప్రకటించాడు. సమ్మె విషయంలో ఘనమైన ప్రకటనలు చేసిన తెలుగు నిర్మాతలు పెద్దగా ఏమీ సాధించకుండానే సమ్మె విరమిస్తే.. మనవాళ్ల స్ఫూర్తితో సమ్మె మొదలుపెట్టిన తమిళ నిర్మాతలు ఎంత సిన్సియర్ గా సమ్మె కొనసాగిస్తున్నారో కదా?
Tags:    

Similar News