అమితాబ్ కు అవార్డు.. త‌మిళుల వేద‌న‌

Update: 2016-03-29 17:08 GMT
అమితాబ్ బ‌చ్చ‌న్ జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఎంపికైనందుకు దేశ‌మంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. కానీ త‌మిళ ప్రేక్ష‌కులకు మాత్రం ఈ విష‌యం రుచించ‌ట్లేదు. త‌మ వాడికి రావాల్సిన అవార్డును బిగ్‌-బి త‌న్నుకుపోయాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు అర‌వోళ్లు. ఐతే వాళ్ల ఆవేద‌న‌లో అర్థం ఉంది లెండి. వాళ్లు అవార్డు ఆశించిన న‌టుడు.. అత‌డి పెర్ఫామెన్స్ అలాంటిది మ‌రి.

ఇంత‌కీ ఆ న‌టుడు ఎవ‌రంటారా.. విక్ర‌మ్‌. ఈ పేరు విన్నాక త‌మిళోళ్ల కోరిక స‌మంజ‌స‌మే అనిపిస్తోంది క‌దా. గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘ఐ’ సినిమాకు గాను విక్ర‌మ్ జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌వుతాడ‌ని ఆశించింది త‌మిళ ప‌రిశ్ర‌మ‌. దేశంలో మ‌రే న‌టుడూ ప‌డ‌నంత క‌ష్టం ప‌డ్డాడు విక్ర‌మ్‌. పాత్ర కోసం చిక్కి శ‌ల్య‌మ‌య్యాడు. అసాధార‌ణంగా బాడీ కూడా పెంచాడు. కేవ‌లం క‌ష్టప‌డి రూపం మార్చుకోవ‌డ‌మే కాదు..లింగేశ్వ‌ర‌న్ పాత్ర‌లో అద్భుత‌మైన న‌ట‌న కూడా ప్ర‌ద‌ర్శించాడు విక్ర‌మ్‌.  అందుకే అత‌డికి జాతీయ అవార్డు వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ అవార్డు క‌మిటీ అమితాబ్ కే ప‌ట్టం క‌ట్టింది.

ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ సైతం విక్ర‌మ్ కు అవార్డు రాక‌పోవ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. విక్ర‌మ్ కు జాతీయ అవార్డు రాక‌పోవ‌డం అత‌డి లాస్ కాద‌ని.. జాతీయ అవార్డే విక్ర‌మ్ ను మిస్స‌యింద‌ని ట్వీట్ చేశాడు పీసీ శ్రీరామ్‌. ఐతే విక్ర‌మ్ ఇంత‌కుముందే పితామ‌గ‌న్ (శివ‌పుత్రుడు) సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నాడు.
Tags:    

Similar News