జాతీయ అవార్డు గెలుచుకోవాలన్నది ప్రతి టెక్నీషియన్ కనే కల. తమిళ ఎడిటర్ టీఈ కిషోర్ కూడా ఇప్పటికే ఓసారి ఆ కలను నెరవేర్చుకున్నాడు. ‘ఆడుగళం’ సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి అతడికి ఆ పురస్కారం దక్కింది. కానీ ఆ అవార్డు అందుకోవడానికి అతను లేడు. కోలీవుడ్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరి కంట నీళ్లు తెప్పిస్తున్న ఉదంతమిది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ‘విసారణై’ చిత్రానికి కిషోర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ కు కిషోర్ ఆస్థాన ఎడిటర్. ‘విసారణై’ చిత్రం ఈ ఫిబ్రవరిలో విడుదలైనప్పటికీ.. దాదాపు ఏడాది కిందటే ఈ చిత్రం పూర్తయింది. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు గెలుచుకుంది.
గత ఏడాది మార్చి మొదటి వారంలో ‘విసారణై’ చిత్రానికి పని చేస్తుండగా కిషోర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు వైద్యులు. సర్జరీ చేసి అతడి ప్రాణాలు నిలబెట్టడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మార్చి 6న బ్రెయిడ్ డెడ్ అయింది. కిషోర్ చనిపోయాడు. ఐతే కిషోర్ లేకపోయినా.. అతను పనిచేసిన సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు జాతీయ అవార్డు కూడా అందుకుంది. ‘విసారణై’ సినిమా ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగానూ పురస్కారం దక్కించుకోవడం విశేషం. అసలీ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగానూ అవార్డు వస్తుందని ఆశించారు కోలీవుడ్ జనాలు. ఐతే ‘బాహుబలి’ ఆ అవార్డుకు ఎంపికైంది.