నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి నటించిన లేటెస్ట్ మూవీ 'మంత్ ఆఫ్ మధు'. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహించారు. క్రిష్వీ ప్రొడక్షన్స్, హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానరన్ పై యశ్వంత్ ములుకుట్ల ఈ మూవీని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తరువాత కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా గురువారం ఈ మూవీ టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.
'నేను నీకో విషయం చెబుతున్నా కళ్లు మూసుకో..ఐ లవ్ మధు... 20 ఏళ్ల బాధ..ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పమంటే చెప్పలేను.. చెప్పే ఉద్దేశ్యం కూడా లేదు' అంటూ కలర్స్ స్వాతి చెబుతున్న డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి.
1 మినట్ 58 సెకన్ల నిడివితో సాగిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. బ్యూటిఫుల్ విజువల్స్ తో హీరో, హీరోయిన్ ల కథని అందంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఓ తాగుబోతుని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి అతనితో విడిపోవాలని ఎందుకు కోర్టు మెట్లెక్కింది?.. ఆ తరువాత వీరి జీవితాల్లో ఎలాంటి సంఘనలు చోటు చేసుకున్నాయి? అన్నదే ఈ చిత్ర ప్రధాన కథగా తెలుస్తోంది.
మానవ సంబంధాలు.. ఓ విషయాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నారనే కోణంని ఆవిష్కరిస్తూ 'మంత్ ఆఫ్ మధు' మూవీని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. వైజాగ్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు, కళ్లకు కనువిందుగా నిలిచే విజువల్స్, అచ్చు రాజమణి సంగీతం, అందమైన ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటిస్తున్న రెండవ సినిమా ఇది. ఇందులో నవీన్ చంద్ర వింటేజ్ లుక్ లో యువకుడిగా కనిపించి అదరగొట్టాడు.
భార్యా భర్తల మధ్య వచ్చే క్షణికావేశపు తగాదాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు దారి తప్పితే ఓపికతో మార్చుకునే ప్రయత్నం చేసి చివరికి విడిపోవాలనుకున్న ఓ భార్య భర్తల కథగా ఈ మూవీని రూపొందించారు.
ఇక కలర్స్ స్వాతి సగటు భార్యగా, ప్రేమికురాలిగా తనదైన నటనతో ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ మూవీ వుంటుందని టీజర్ తో స్పష్టమవుతోంది. సింగ్ సౌండ్ తో ఈ మూవీని రూపొందించారు. శ్రేయా నవేలీ, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View