మ‌హిళా ద‌ర్శ‌కులే లేరా.. ఏవీ తెలంగాణ అవార్డులు?

Update: 2020-03-07 12:30 GMT
రాను రాను తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి మ‌హిళా ద‌ర్శ‌కుల కొర‌త వెంటాడుతోందా? దాదాపు 50పైగా చిత్రాల‌ను తెర‌కెక్కించిన లెజెండ‌రీ ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల త‌ర్వాత అంత‌టి వారు ఇక మ‌న సినీ ఇండ‌స్ట్రీకి క‌రువ‌య్యారా? అంటే ఆ లోటు స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఉన్న కొద్దిమంది లేడీ డైరెక్ట‌ర్ల‌ల‌లో విజ‌య నిర్మ‌ల త‌ర్వాత జీవిత‌.. బి.జ‌య పేర్లు వినిపించేవి. బి.జ‌య ఇటీవ‌లే కాలం చేసిన సంగ‌తి తెలిసిందే. జీవిత రాజ‌శేఖ‌ర్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం లేదు.

80వ ద‌శ‌కంలో ఒక వైపు న‌టిగా రాణిస్తూనే మ‌రో వైపు ద‌ర్శ‌కురాలిగా త‌న స‌త్తా చాటారు విజ‌య నిర్మ‌ల త‌న భ‌ర్త సూప‌ర్ స్టార్ క్రిష్ణ‌ తో అద్భుత‌మైన చిత్రాలు నిర్మించి మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ద‌ర్శ‌కురాలి గా త‌న ప్ర‌తిభను చాటారు. అనేక అవార్డుల‌తోపాటు రివార్డులు కూడా ఆమెను వ‌రించాయి. దీంతోపాటు బాలీవుడ్‌- కోలీవుడ్ ల‌ను సైతం ఆమె ఆక‌ర్షించారు. ఆయా భాష‌ల్లోనూ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఇప్ప‌టి త‌రంలో అలాంటి మ‌హిళా ద‌ర్శ‌కులు భూత‌ద్దం వేసి వెతికినా దొర‌క‌డం క‌ష్ట‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌తిసారీ తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌క‌టించే అవార్డుల జాబితాలో సినీ ప‌రిశ్ర‌మ నుంచి ద‌ర్శ‌కురాలు ఎవ‌రైనా ఉండి తీరాలి. కానీ కొంత‌కాలంగా ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన అవార్డుల్లో ఒక్క‌రు కూడా మ‌హిళా ద‌ర్శ‌కులు ఎంపిక కాలేదు. దీంతో కొంతవ‌ర‌కూ సినీ ప‌రిశ్ర‌మ నిరాశ చెందిన‌ప్ప‌టికీ సింగ‌ర్ మంగ్లీ రూపంలో కాస్త ఊర‌ట ద‌క్కింది. తెలంగాణ ప్ర‌భుత్వం 20 రంగాల్లో ప్ర‌తిభ చాటిన 30 మంది మ‌హిళ‌ల‌కు అవార్డులు ప్ర‌క‌టించింది. ఇందులో జాన‌ప‌ద క‌ళా విభాగంలో గాయ‌ని మంగ్లీ అవార్డును సొంతం చేసుకుంది. మంగ్లీ పూర్తి పేరు మంగ్లీ స‌త్య‌వ‌తి. త‌న పాట‌ల‌తో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఇట్టే మాయ చేస్తోంది ఈ గాయ‌ని. బుల్లితెర యాంక‌ర్‌గా.. న‌టిగా ఆమె రాణిస్తోంది. మాట‌కారి మంగ్లీ ప్రోగ్రామ్ ద్వారా త‌న కెరీర్ ప్రారంభించిన మంగ్లీ త‌న తండ్రి బాలు నాయ‌క్ స్ఫూర్తితో గాయ‌నిగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ఉగాది.. బోనాలు.. స‌మ్మ‌క్క‌-సార‌క్క జాత‌ర‌ల స‌మ‌యం లో మంగ్లీపాట కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎదురు చూస్తూ ఉంటారంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రోవైపు యూట్యూబ్ సంచ‌ల‌నం గంగ‌వ్వ‌కు కూడా ఈసారి అవార్డు ద‌క్కింది. తెలంగాణ యాస‌లో తాను మాట్టాడే విధానం అంద‌రికీ న‌వ్వులు పూయిస్తుంది. మ‌ల్లేశం- ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాల్లో న‌టించిన ఈ అవ్వ మంచిన‌టిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. గంగ‌వ్వ‌ది జ‌గిత్యాల జిల్లా మ‌ల్య‌లా మండ‌లంలోని లంబాడిప‌ల్లి గ్రామం. గంగ‌వ్వ‌కు.. మంగ్లీకి నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అవార్డుల జాబితాలో మ‌హిళా ద‌ర్శ‌కులు కానీ.. ఇత‌ర న‌టీమ‌ణులు కానీ.. 24 క్రాఫ్టుల ప్ర‌తిభ కానీ లేక‌పోవ‌డం నిస్తేజాన్ని నింపుతోంది.
Tags:    

Similar News