ఒక్క సినిమాకే చుక్కలు చూపిస్తోంది

Update: 2016-02-15 22:30 GMT
హీరోయిన్లకు కాస్త క్రేజ్ వచ్చాక పోజ్ కొట్టడం, చక్కగా చెప్పుకుంటు చుక్కలు, నాటుగా చెబితే నిర్మాతలకు నరకం చూపించడం సాధారణంగా జరిగేదే. అవి కావాలి, ఇవాలి కావాలి అనే డిమాండ్లు.. షూటింగులకు చెప్పాపెట్టకుడా డుమ్మా కొట్టడం.. ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొత్త హీరోయిన్స్ మాత్రం ముందు పద్ధతిగానే ఉంటారని చెప్పచ్చు. కానీ రీసెంట్ గా విడుదలైన ఓ మూవీ హీరోయిన్ మాత్రం.. అప్పుడే స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో పోజ్ ఇచ్చేస్తోందట.

నిజానికి షూటింగ్ సమయంలోనే ఈ బిహేవియర్ మొదలైపోయినా.. అప్పటికే సగం సినిమా పూర్తయిపోవడంతో.. ఎలాగోలా నెట్టుకొచ్చారని తెలుస్తోంది. ఆమెను కూచోబెట్టి.. ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు తల్లీ అని అర్ధమయ్యేలా చెప్పి కష్టపడి సినిమా పూర్తి చేశారట. అయితే.. ఈ హీరోయిన్ లుక్స్ విషయంలో పెద్ద గొప్పగా లేకపోయినా, యాక్టింగ్ స్కిల్స్ విషయంలో మాత్రం పర్లేదనే టాక్ ఉంది.

చివరకు ఆ సినిమా హిట్ అయింది, దీనికి కారణం హీరోకి సహజమైన నటుడిగా మంచి పేరుండడం, దర్శకుడికి కళాత్మక దర్శకుడిగా గుర్తింపు ఉండడంమే కారణం. అంతే తప్ప హీరోయిన్ పరంగా మాత్రం హిట్ కాదనే విషయం ఆ భామ గుర్తించలేదంటున్నారు. ఈమె బిహేవియర్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా తెగ మాట్లాడేసుకుంటోంది. హిట్ సినిమాతో అరంగేట్రం చేసినా.. ఇంకా ఛాన్సులు రాకపోవడానికి కారణం.. ఆమె ప్రవర్తనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.
Tags:    

Similar News