స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడం చాలా అరుదు. తమిళంలోను శంకర్ - మణిరత్నం-ఎస్.జె.సూర్య లాంటి టాప్ డైరెక్టర్లకు మాత్రమే అతడితో పని చేసే అవకాశం ఉంటుంది. చాలా అరుదుగా మాత్రమే ఇతర దర్శకుల కథలకు ఓకే చెబుతుంటారు. అయితే ఇప్పుడు రెహమాన్ ని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఓ తెలుగు చిత్రానికి ఒప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనికోసం అతడు పదే పదే హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాడు. రెహమాన్ ని కలుసుకుని కథను వినిపించాడు. బౌండ్ స్క్రిప్టు రెడీ అయ్యాక ఫైనల్ వెర్షన్ విన్న రెహమాన్ అతడితో పని చేసేందుకు అంగీకరించారని సమాచారం. అయితే రెహమాన్ లాంటి సంగీత దిగ్గజాన్ని ఒప్పించడంతోనే అతడు సగం సక్సెస్ సాధించేశాడనడంలో సందేహం లేదు.
స్క్రిప్టు పరంగా ఎలాంటి సందిగ్ధతలు ఉన్నా స్వరమాంత్రికుడు రెహమాన్ అంగీకరించడం అసాధ్యం. కానీ అలాంటి డౌట్లు ఏవీ లేకుండా కథ బౌండ్ స్క్రిప్టుతో మెప్పించాడు కాబట్టే బుచ్చిబాబు ఇంత పెద్ద సక్సెస్ సాధించాడని విశ్లేషిస్తున్నారు. అయితే రెహమాన్ ని ఒప్పించిన విషయంలో అతడు ఇంకా ఎలాంటి లీకులు ఇవ్వలేదు. అధికారికంగా దీని గురించి ప్రకటించాల్సి ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
చాలా కాలంగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అతడు ప్రీప్రొడక్షన్ ని దాదాపు పూర్తి చేసాడు. సాంకేతిక నిపుణులు ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేస్తున్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ని కలుసుకునేందుకు పదే పదే చెన్నైకి వెళ్లాడు.
చివరికి రెహమాన్ ని ఒప్పించడంలో సఫలమయ్యాడని తెలుస్తోంది. చరణ్ తో బుచ్చిబాబు చిత్రం ఇంకా అధికారికంగా ప్రారంభించనున్నారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ దాదాపు పూర్తయింది. రెహమాన్ ఎంపికతోనే బుచ్చిబాబు సగం విజయం సాధించాడు. ఇంతకీ ఈ సినిమా కథాంశం ఎలా ఉంటుంది? అంటే.. ఇది స్పోర్ట్స్ డ్రామా. సినిమా ఆద్యంతం ఎమోషన్ భారీ యాక్షన్ తో ఆకట్టుకోనుందని టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' లాంటి భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఏ.ఆర్.రెహమాన్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి అంగీకరించడం ఆసక్తిని కలిగిస్తోంది. రెహమాన్ తో చరణ్ కి రెండో సినిమా. అతడు ఆర్.ఆర్.ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాక రెహమాన్ తో పని చేసే అవకాశం కలగడం ప్రధాన అస్సెట్ కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో గతంలో 'కొమరం పులి' లాంటి భారీ చిత్రానికి రెహమాన్ పని చేసారు. ఆ సినిమా ట్యూన్స్ సంగీత ప్రియుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే.