తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'వారీసు'. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. వంశీ పైడిపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోలు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వుండటం, వంశీ పైడిపల్లి తో సినిమా చేయడానికి రెడీ గా లేకపోవడంతో తమిళ హీరో విజయ్ ని ఎంచుకున్నాడు.
తనకిది తమిళంలో స్ట్రెయిట్ ఫస్ట్ ఫిలిం. ముందు 'ఊపిరి' మూవీని 'తొళ' పేరుతో చేసినా పక్క తమిళ నేటివిటీ, తమిళ నటీనటులతో వంశీ పైడిపల్లి చేసిన తొలి తమిళ చిత్రమిది. అంతే కాకుండా నిర్మాత దిల్ రాజుకు కూడా తమిళంలో ఇదే ఫస్ట్ మూవీ. ఇలాంటి ప్రత్యేకతల మధ్య భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. తమిళంలో జనవరి 11నే విడుదలైన ఈ మూవీ తెలుగులో మాత్రం తెలుగు సినిమాల హడావిడీ కాకరణంగా కాస్త ఆలస్యంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తెలుగు నుంచి తమిళ ఇండస్ట్రీకి వెళ్లి బ్లాక్ బస్టర్ లని సొంతం చేసుకున్న దర్శకులు చాలా అరుదు. అప్పట్లో కొంత మంది తెలుగు దర్శకులు తమిళంలో సినిమాలు చేసినా కానీ ఈ మధ్య కాలంలో మాత్రం తమిళంలోకి వెళ్లి బిగ్ స్టార్ తో సినిమాలు చేసిన వాళ్లు మాత్రం లేదు. ఈ విషయంలో వంశీ పైడిపల్లి పేరు ముందు వరుసలో నిలుస్తోంది. జనవరి 11న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన 'వారీసు' అక్కడ మాత్రం ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన 'వారీసు' విజయ్ అభిమానుల్ని ఓ రేంజ్ లో అలరిస్తూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోకు వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు రాబట్టి విజయ్ సినిమాల్లోనే సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 210 కోట్ల మేర వసూళ్లని రాబట్టి హీరో దళపతి విజయ్ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. తమిళంలో ఇంత వరకు ఏ తెలుగు దర్శకుడు సాధించని ఫీట్ ని దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ మూవీతో క్కించుకోవడం విశేషంగా చెబుతున్నారు.
తమిళంలో మాత్రం భారీ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తున్న తీరు ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మూవీకి విజయ్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టడానికి ప్రధాన కారణం హీరో విజయ్ ఎలివేషన్స్ అని తెలుస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి అభిమానుల నాడికి తగ్గట్టుగా హీరో ఎలివేషన్స్ విషయంలో ఎక్కడా తగ్గక పోవడమే తాజా ఫలితానికి ప్రధాన కారణం అని, వంశీ పైడిపల్లి తనదైన టేకింగ్ మేకింగ్ తో తమిళ తంబీలని తన మాయలో పడేయడంతో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.