అసలు తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ఛాన్సులు రావట్లేదని ఏడుస్తుంటారు. కాని ఛాన్స్ వస్తే ఎంతమంది ప్రూవ్ చేసుకుంటున్నారు? ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య అన్నట్లుంది యవ్వారం. కొంతమంది అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ కు దూరం. కొందరు సినిమా సినిమాకూ లావెక్కిపోతుంటారు. కొందరు యాటిట్యూడ్ తో పాడు చేసుకుంటుంటారు. స్టార్ హీరోయిన్ అయిన ఎవరినైనా తీసుకోండి.. వారు ఎలా మెట్యూరిటీ నటిస్తూ.. వినయంగా ఉంటూ.. అవకాశాలను పట్టుకుపోతున్నారో.
ఇప్పుడు ఒక తెలుగమ్మాయికి నలుగు హీరోలు చేస్తున్న ఒక సినిమాలో ఛాన్సొచ్చింది. సరే వచ్చింది కదా.. ఇంటర్యూల్లో ఇతర ఈవెంట్లలో తెలుగులో మాట్లాడొచ్చుకదా. అబ్బేలేదు. అమ్మడు ఫుల్లుగా ఇంగ్లీషులో దంచేస్తోంది. అదేమంటే.. అదో పిచ్చి. అవతల తమిళనాడు నుండి వచ్చిన సమంత.. పంజాబ్ నుండి వచ్చిన రకుల్ ప్రీత్ లు తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడుతూ మనోళ్ళను ఉర్రూతలూగిస్తుంటే.. తెలుగునాటే పుట్టి పెరిగిన తెలుగమ్మాయిలు మాత్రం.. ఇలా ఇంగ్లీషు సోకులు చూపించడం జనాలకు రుచించట్లేదు.
ఇకపతో కొంతమంది తెలుగు పిల్లలకు ప్రొఫెషనాల్టి లేకపోవడం.. టైముకు రాకపోవడం.. మేకప్ అండ్ హెయిర్ విషయంలో గగ్గోలు పెట్టడం.. కాస్ట్యూమ్స్ విషయంలో స్టైలిస్ట్ మాట వినకుండా తమకే అన్నీ తెలిసినట్లు ఓవర్ చేయడం.. వగైరా వగైరా మైనస్ పాయింట్లు ఉన్నాయట. అందుకే తెలుగు అమ్మాయిలను ఎక్కువగా ఎంకరేజ్ చేయలేకపోతున్నాం అంటున్నారు సినిమావాళ్ళు. పాపలూ.. వింటున్నారా?