సంక్రాంతి అయిపోయిందని బాధపడకండే

Update: 2016-01-15 11:30 GMT
సంక్రాంతికి వరుసగా నాలుగు సినిమాలు వచ్చాయి. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్‌, ఎక్సప్రెస్‌ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు వచ్చాయి. మళ్లీ అసలు ఇంత తక్కువ గ్యాప్‌ లో ఇన్నేసి సినిమాలు చూస్తామా? అసలు ఈ రేంజు ట్రీట్‌ మళ్లీ టాలీవుడ్‌ ఇస్తుందా? ఇలా మీరు ఫీలవుతుంటే మాత్రం.. అస్సలు అక్కర్లేదు అక్కడే ఆపేయండి. రానున్న నెలల్లో ఇంతకంటే పెద్ద ట్రీట్‌ సిద్దంగా ఉంది.

వచ్చే శుక్రవారం.. జనవరి 21న నందిని రెడ్డి 'కళ్యాణ వైభోగమే' వస్తోంది. ఆ మరుసటి రోజునే ఆది ‘గరం’ కూడా రావొచ్చు.  విశాల్‌ నటించిన ‘కథకళి’ కూడా అదే రోజునే రిలీజవ్వనుంది. ఆ పై వారం.. 29న రాజ్‌తరుణ్‌ ‘సీతమ్మ అందాలు రామయ్యసిత్రాలు’, నవీన్‌చంద్ర ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’, సిద్ధార్థ్‌ నటించిన ‘చంద్రకళ2’ వస్తోంది. ఇక ఫిబ్రవరి 5న నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ', అలాగే సునీల్‌ 'కృష్ణాష్టమి' వస్తున్నాయి. 'శౌర్య', 'స్పీడున్నోడు' వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఆ తరువాత పెద్ద సినిమాలు చాలానే క్యూ కట్టేసే ఛాన్సుంది. సర్దార్‌, సరైనోడు, బ్రహ్మోత్సవం సినిమాలున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా రావొచ్చు.

మొత్తానికి సమ్మర్‌ వరకు నాన్‌ స్టాప్‌ ఎంటరటైన్మెంట్‌ అందించడానికి టాలీవుడ్‌ రెడీ. అందుకోవడానికి మీరు రెడీయా?
Tags:    

Similar News