'సినిమాలు సినిమాలే.. కాన్సర్టులు కాన్సర్టులే.. ఏదీ దేనికీ అడ్డు కాదు!' అనేస్తోంది అందాల శ్రుతిహాసన్. సినీ కెరీర్ కి లాంగ్ బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు అప్పట్లో మ్యూజిక్ కాన్సెర్టుల వైపు మొగ్గు చూపింది. రెండేళ్లనాటి సన్నివేశానికి తగ్గట్టే ప్రియుడికి దగ్గరగా ఉండేందుకు విదేశాల్లో మ్యూజిక్ బ్యాండ్ .. లైవ్ కాన్సెర్టుల పేరుతో రకరకాల ప్రయత్నాలు చేసింది. ప్రతిభావంతురాలు అని నిరూపించుకున్నా.. అమెరికా-ఇంగ్లండ్ లాంటి చోట్ల ఉన్న భారీ కాంపిటీషన్ దృష్ట్యా శ్రుతి ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.
అయినా ఇప్పటికీ తన ప్యాషన్ ని మాత్రం వదులుకోలేదు. మరోసారి విదేశాలకు వెళ్లి మ్యూజిక్ కాన్సెర్టుల్లో పాల్గొనబోతోందట. నవంబర్ 28 నుంచి ఇక ఇక్కడ అందుబాటులో ఉండదు. ఇంగ్లండ్ రాజధాని లండన్ లో వరుసగా లైవ్ మ్యూజిక్ కాన్సెర్టుల్లో పాల్గొనేందుకు వెళుతోంది. త్వరలోనే ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ తో కలిసి ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రిపరేషన్ లో ఉందట.
అయితే మాస్ మహారాజాతో షెడ్యూల్స్ కి క్లాష్ రాదా? ఇప్పటికే టాలీవుడ్ లో వరుస కమిట్ మెంట్లతో బిజీ అవ్వాలనుకున్న కల నెరవేరేదెలా? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే మ్యూజిక్ మ్యూజిక్కే.. సినిమాలు సినిమాలేనంటూ అమ్మడు తప్పించుకుంటోంది. ఇక్కడ షెడ్యూళ్లకు ఏ ఇబ్బంది లేకుండానే అక్కడ కొత్త షెడ్యూల్స్ కి కాల్షీట్లు ఇచ్చిందట. అట్నుంచి తిరిగి వచ్చాకే తెలుగు-తమిళంలో ఆన్ సెట్స్ ఉన్న సినిమాల్లో జాయిన్ అవుతుందట. ఇలా అయితే ఓకే కానీ మాస్ రాజాతో సినిమా తప్ప వేరే ప్రయత్నాలేవీ ఫలించకే ఇప్పుడు ఆ ఖాళీని భర్తీ చేసేందుకు అటెళుతోందా? అంటూ కొత్త చర్చ మొదలైంది. సినిమాల పనవ్వకే ఈ కాన్సెర్టులా? అంటూ కొందరు సందేహిస్తున్నారు. మరి శ్రుతి వీటికి ఏ సమాధానం చెబుతోందో?