దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా `తలైవి` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమ్మ పాత్ర పోషిస్తున్న కంగనా రనౌత్ లుక్.. లెజెండరీ నటుడు ఎంజీఆర్ పాత్ర ఫస్ట్ లుక్ రిలీజయ్యాయి. అమ్మ జయలలిత పాత్ర లుక్.. ప్రోస్థటిక్స్ పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవ్వగా.. తలైవి ఇతర లుక్ కి చక్కని ప్రశంసలే దక్కాయి. అలాగే ఎంజీఆర్ పాత్రలో అందగాడు అరవింద స్వామి యాప్ట్ గా ఉన్నారన్న ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా కోసం ఎంజీఆర్ నటించిన పుదై భూమి చిత్రంలోని ఓ క్లాసిక్ సాంగ్ ని తలైవి కోసం రీమిక్స్ చేయడం ఆసక్తికరం. తమిళ ప్రజల ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ `నను ఉంగళ్ వీటు పిళ్లై` అనే పాటలో ఎంజీఆర్ స్టెప్పులను రీక్రియేట్ చేస్తున్నారు.
తాజాగా చిత్రబృందం మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో తలైవి క్లాసిక్ డ్యాన్సులకు సంబంధించిన మయూర భంగిమ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎర్ర చీరలో బంగారు ఆభరణాలు ధరించిన కంగన అచ్చం క్లాసిక్ డేస్ జయలలితనే తలపిస్తోంది. కథానాయికగా ఎదిగే క్రమంలో జయలలిత ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఆ లుక్ ని ప్రతిబింబించే వేషధారణ ఇదని చెప్పొచ్చు.
ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్ ని సౌత్ సహా ఉత్తరాదినా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి- శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తిచేసి జూన్ 26న రిలీజ్ చేస్తారు.