చివరి నిమిషంలో వచ్చి నిలబెట్టాడు

Update: 2019-04-06 05:18 GMT
నిన్న విడుదలైన మజిలి పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయ్యింది. వసూళ్ల లెక్కలు ఇంకా బయటికి రాలేదు కాని సెలవును బాగా వాడుకుని బెస్ట్ నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ మాట. అదలా ఉంచితే కథలో కొత్తదనం లేకపోయినా మజిలి ఇంతగా కనెక్ట్ కావడానికి మూడు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి శివ నిర్వాణ ఫీల్ గుడ్ ఎమోషనల్ టేకింగ్. రెండు చైతు సామ్ ల సహజ నటన. మూడు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. రిలీజ్ డేట్ ముందే లాక్ చేసుకున్న కారణంగా మలయాళంలో బిజీగా ఉన్న గోపి సుందర్ ఆ టైంకి ఫినిష్ చేయలేనని ముందే చేతులు ఎత్తేశాడు.

అప్పుడు రంగ ప్రవేశం చేశాడు తమన్. ఇటీవలి కాలంలో ట్యూన్స్ కంటే ఎక్కువగా బిజిఎంతో అదరగొడుతున్న తమన్ మజిలికి సైతం తనదైన శైలిలో ప్రాణం పోశాడు. దివ్యన్షుతో లవ్ ట్రాక్ కు ఒక సిగ్నేచర్ ట్యూన్ సాం చైతులకు విడిగా ఒక ట్రాక్ హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్ లో మరో మార్క్ ఇలా ఎక్కడిక్కడ వైవిధ్యం చూపించాడు

ఇదే మజిలి సక్సెస్ లో ఓ కీలక ఫ్యాక్టర్ గా మారింది. సోషల్ మీడియాలో సైతం తమన్ మీద ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడని ట్యూన్స్ కూడా కంపోజ్ చేసి ఉంటే తొలిప్రేమ లాగా మరో మంచి ఆల్బం వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఎలా ఉన్నా తమన్ ను మంచి మార్కులు పడటం అతని కెరీర్ పరంగా బూస్ట్ ఇచ్చేదే.

వంద సినిమాల అనుభవంతో కొత్తగా ప్రూవ్ చేయాల్సింది లేకపోయినా పోటీ పెరగడంతో పాటు ఇటీవల కాస్త రొటీన్ గా వెళ్తున్నాడు అన్న కామెంట్ తమన్ మీద ఉంది. ఇది పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్న తమన్ పాటల కంటే ఎక్కువగా మణిశర్మ తరహాలో బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్ట్ గా మారుతున్నాడు. అయితే మజిలిలో తమన్ మేజిక్ ఫీల్ కావాలి అంటే మాత్రం మంచి సౌండ్ సిస్టం ఉన్న హాల్ కంపల్సరీ
   

Tags:    

Similar News