#ద‌ళ‌ప‌తి 66.. ఎట్ట‌కేల‌కు నా క‌ల నిజ‌మైంది!

Update: 2022-04-05 15:02 GMT
బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల‌కు ప‌ని చేస్తూ ఈ సీజ‌న్ లో సౌతిండియా బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వెలిగిపోతున్నాడు ఎస్.ఎస్.థ‌మ‌న్. ఇన్నాళ్లు విమ‌ర్శ‌ల ఝ‌డివాన‌లో త‌డిసి ముద్ద‌యిన థ‌మ‌న్ కి ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత సీన్ అంతా మారిపోయింది. త‌న‌ని విమ‌ర్శించేవాళ్ల‌కు ప్రాక్టిక‌ల్ గా అత‌డు ఆన్స‌ర్ ఇస్తున్నాడ‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్ప‌టికిప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ - ప్ర‌భాస్ - ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ - చిరంజీవి .. ఇలా అగ్ర హీరోల సినిమాల‌కు ప‌ని చేస్తున్నాడు. అటు త‌మిళంలోనూ ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాకి ప‌ని చేసే అరుదైన‌ అవ‌కాశాన్ని అందుకున్నాడు. ద‌ళ‌ప‌తి 66 కి థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఫిక్స‌య్యాడు. శంక‌ర్ తో ఆర్.సి 15 లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా ఫిక్స‌య్యాక థ‌మ‌న్ గ్రాఫ్ అమాంతం ప‌దింతైంది. ఇంత‌లోనే విజ‌య్ లాంటి క్రేజీ స్టార్ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా కుదిరాడు.

అయితే ఈ అవ‌కాశం కోసం అత‌డు చాలా కాలంగా వేచి చూస్తున్నాన‌ని ఎట్ట‌కేల‌కు అది ఫ‌లించింద‌ని ఎంతో ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నాడు. మ‌నంద‌రి డియ‌రెస్ట్ యాక్ట‌ర్ విజ‌య్ అన్నాతో ఎట్ట‌కేల‌కు నా క‌ల నిజ‌మైంది.. ఇది చాలా గ్రేట్ ఫీలింగ్..! అంటూ ఆనందం వ్య‌క్తం చేశాడు. థ‌మ‌న్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ చేస్తూ పోస్ట‌ర్ ని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ద‌ళ‌ప‌తి 66కి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఫ‌ర్ మి ఇట్ ఈజ్ గోయింగ్ టు బి... 6-6-6-6-6-6 !! అంటూ ఫైర్ మ్యూజిక్ ఈమోజీల‌ను షేర్ చేశాడు థ‌మ‌న్. మ్యూజిక‌ల్ ఫైర్ వ‌ర్క్స్ అన్నిచోట్లా! అంటూ ఆనందాన్ని అస్స‌లు దాచుకోలేక‌పోయాడు. ఇంత‌కుముందు వ‌కీల్ సాబ్ చిత్రంతో తెలుగు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌ల నెర‌వేరింది. ఇప్పుడు త‌మిళ ప‌వ‌ర్ స్టార్ తో కూడా క‌ల నెర‌వేరింద‌న్న‌మాట‌. గ్రేట్ థ‌మ‌న్ సాబ్!

రాజుగారు ది గ్రేట్

ఆర్.సి 15 షూటింగ్ ని పూర్తి చేస్తూనే రాజు గారు ద‌ళ‌ప‌తి విజ‌య్ తో సినిమాని ప‌ట్టాలెక్కిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఒకేసారి అగ్ర హీరోల‌తో వ‌రుస‌గా భారీ పాన్ ఇండియా చిత్రాల్ని నిర్మిస్తూ గ‌ట్స్ ఉన్న నిర్మాత‌గా నిరూపించుకుంటున్నారు. ఆర్.సి 15 కోసం నెవ్వ‌ర్ బిఫోర్ అనేంత పెద్ద బడ్జెట్ ని పెడుతున్న దిల్ రాజు విజ‌య్ పైనా 100 కోట్లు పైగానే బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేయ‌నున్నారు. విజ‌య్ ఇప్ప‌టికే బీస్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి రిలీజ్ చేయించే ప‌నిలో ఉన్నాడు. ఏప్రిల్ 13న బీస్ట్ విడుద‌ల‌వుతోంది. త‌దుప‌రి వంశీ పైడిప‌ల్లితో సెట్స్ కెళ‌తాడు.
Tags:    

Similar News