సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన భావాలను చెప్పడంలో ఏ మాత్రం వెనకాడరు. చిన్నా పెద్దా లాంటి తారతమ్యాలు లేకుండా.. ఏ టాపిక్ అయినా తన ఉద్దేశ్యాలను వ్యక్తం చేస్తుంటారు. గతంలో ప్రెస్ మీట్స్ లాంటి వాటిలోనే మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించేసి.. తను చెప్పదలచుకున్న మాటలను అందరికీ తరచుగా చేరవేస్తున్నారు.
ఇప్పుడు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా రూపొందిస్తున్నామని చెప్పుకుంటున్న వారిపై ఆయన మాట్లాడారు. 'ఓ హీరో రెమ్యూనరేషన్ 20 నుంచి పాతిక కోట్లు.. దర్శకుడికి దాదాపు అంతే ఉంటోంది. హీరోయిన్లకు కూడా కలిపితే ఓ 50 కోట్లు అక్కడే అయిపోతుంది. సినిమా వడ్డీలు కాబట్టి.. ఏడాది పాటు తీసినా కనీసం ఓ 15 కోట్లు కట్టాలి. 150-200 రోజుల షూటింగ్ చేస్తున్నారు. రోజుకు 15 లక్షలు వేసుకున్నా 20 కోట్లు ఖర్చవుతుంది. వర్కింగ్ డేస్ ప్రకారం చూసుకుంటే 40 రోజులే ఉంటుంది. 40 రోజుల్లో చేయాల్సిన పనే 200 రోజులు చేస్తున్నారు. 40 రోజుల్లే చేస్తే 4 కోట్లే 5 కోట్లే అవుతుంది. 4-5 కోట్లు సినిమా తీయడం మీద ఖర్చు పెట్టి 100 కోట్లతో సినిమా తీస్తున్నామని చెప్పుకుంటున్నారు' అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
ప్రస్తుతం ఈయన ఏ సినిమా గురించి మాట్లాడరనే విషయంలో పెద్దగా డిస్కషన్స్ అవసరం లేదు. మహేష్ బాబు- మురుగదాస్ స్పైడర్.. పవన్- త్రివిక్రమ్ కొత్త సినిమా.. ప్రభాస్ - సుజిత్ ల సాహో.. ఇలా పలు చిత్రాల బడ్జెట్ లెక్కలు 100 కోట్లకు పైగానే ఉంటున్నాయి. ఇంతేసి బడ్జెట్ తో పెళ్లి చూపులు లాంటి మూవీస్ ని 40 తీయచ్చని.. శతమానం భవతి వంటి చిత్రాలను 40 తీయచ్చని అన్న తమ్మారెడ్డి.. నటులు.. దర్శకులు.. టెక్నీషియన్లకు ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/