చెలియను చూసొస్తుంటే అవార్డ్ వచ్చిందట..

Update: 2017-04-07 18:22 GMT
మణిరత్నం సినిమాలంటే అనేక అవార్డులను గెలుచుకునేలా ఉంటాయి. యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకూ చాలా అవార్డులు వచ్చేస్తుంటాయి. అయితే.. ఇప్పుడు ఆయన సినిమా చూసి వస్తున్నా సరే.. ఓ దర్శకుడి సినిమాకి అవార్డుతో పాటు గుర్తింపు కూడా వచ్చేసింది.

ఆ దర్శకుడు ఎవరో కాదు.. పెళ్లి చూపులు మూవీతో ఓవర్ నైట్ విపరీతమైన డిమాండ్ సంపాదించేసిన తరుణ్ భాస్కర్. నిజానికి పెళ్లి చూపులు చిత్రానికి ఏ అవార్డ్ ఈవెంట్లోనూ ప్రాధాన్యత లభించలేదు. ఐఫాలో బెస్ట్ కమెడియన్ ఒకటి మాత్రమే దక్కింది. కానీ తాజాగా ప్రకటించిన 64వ జాతీయ అవార్డు ఉత్సవంలో మాత్రం రెండు జాతీయ అవార్డులు దక్కాయి. "నిజానికి నా వర్క్ కు ఇంత గుర్తింపు లభిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఇవాళ నేషనల్ అవార్డులు ప్రకటించనున్నారనే విషయమే ఎవరూ ఇన్ఫాం చేయలేదు" అని చెప్పిన తరుణ్ భాస్కర్.. ఈ అవార్డ్ క్రెడిట్ కి మణిరత్నంకి కట్టబెట్టేశాడు.

"నేను మణిరత్నం గారిని దేవుడిగా భావిస్తాను. అందుకే చెలియా చిత్రాన్ని మొదటిరోజు మొదటి ఆట చూసి.. దేవాలయం(థియేటర్) నుంచి బయటకు రాగానే.. ఈ అవార్డు గురించి చెప్పారు. అంతా ఆ దేవుడి ఆశీర్వాదమే అనిపించింది" అంటూ భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు ఏకలవ్య శిష్యుడు తరుణ్ భాస్కర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News